BREAKING
అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎన్టీఆర్ వీరాభిమాని, టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఎన్టీఆర్ రాజు సంవత్సరీకం.. హాజరై నివాళులర్పించిన నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ కొరకు ఏర్పాట్లు పూర్తి ఐవోనెసిమాబ్ దరఖాస్తును తిరస్కరించిన యూఎస్ ఎఫ్డీఏ గ్రామ అభివృద్ధికి కృషి- నామినేషన్ దాఖలు చేసిన మట్ట వనజాక్షి భక్తిభావానికి ప్రతిరూపం అనంత రూరల్ లో ప్రశాంతంగా ఎన్నికల నామినేషన్లు మెగా కుటుంబం నుంచి మరో యంగ్ హీరో సందడి.. ఘనంగా కొణిదెల పవన్ తేజ్ 'జంట' టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం పటాన్‌చెరు మినీ ఇండియా.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక! నీలం మధు ముదిరాజ్ ఆసక్తికరంగా 'మోసపోయాం జానకి' టైటిల్ పోస్టర్.. రద్దు చేసిన పాత నోట్లతో సరికొత్త క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ కోరా జాన్సన్ ఏఎన్‌సీ పాఠశాలల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు చినమామిడిపల్లిలో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం భారత్‌లో సైలెంట్‌ కిల్లర్‌గా మారుతున్న మధుమేహం - కరీంనగర్ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ మానవతా సంస్థ రెండు కుటుంబాలకు ఆర్థిక ఆసరా.

పటాన్‌చెరు మినీ ఇండియా.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక! నీలం మధు ముదిరాజ్

Select Suryaa Now
పటాన్‌చెరు మినీ ఇండియా.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక! నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు,; వివిధ రాష్ట్రాలు, భాషలు, కులాలు, మతాలకు చెందిన ప్రజలు కలిసిమెలిసి జీవిస్తూ పటాన్‌చెరు ప్రాంతాన్ని మినీ ఇండియాగా తీర్చిదిద్దారని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే పటాన్‌చెరు ప్రత్యేకతని, అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉంటూ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆదివారం పటాన్‌చెరు సాకి చెరువు వద్ద నిర్వహించిన ఛట్ పూజ వేడుకల్లో ఆయన పాల్గొని ఉత్తర భారతీయులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ హయాంలో పటాన్‌చెరు ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడంతో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని గుర్తుచేశారు. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు పటాన్‌చెరును తమ సొంత ప్రాంతంగా భావించి ఇక్కడే స్థిరపడ్డారని తెలిపారు. వారి శ్రమ, కృషితోనే నేడు పటాన్‌చెరు పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.
తెలంగాణ సంస్కృతితో పాటు ఉత్తర భారత సంప్రదాయాలు, వివిధ ప్రాంతాల ఆచార వ్యవహారాలు ఇక్కడ కలగలిసి కనిపిస్తాయని అన్నారు. ప్రతి పండుగను అందరూ కలిసి జరుపుకోవడం ఈ ప్రాంత ప్రజల ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.సూర్యభగవానుడిని ఆరాధిస్తూ భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఛట్ పూజ ఎంతో పవిత్రమైనదని, కుటుంబాల సుఖసంతోషాలు, ఆరోగ్యం కోసం భక్తులు నియమనిష్ఠలతో పూజలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
కుల, మత, ప్రాంతీయ భేదాలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ ఒకే కుటుంబంలా జీవించాలని, పరస్పరం సంప్రదాయాలను గౌరవించుకుంటూ సోదరభావంతో ముందుకు సాగాలని నీలం మధు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. ఛట్ పూజ సందర్భంగా ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, సూర్యభగవానుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు, పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొల్కూరి నర్సింహారెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ పట్లోళ్ల ఆదిత్య రెడ్డి, ఎట్టయ్య, వేడుకల నిర్వాహకులు మున్నా యాదవ్, కిషన్, నేతాజీ, బలం సింగ్, షారుక్, లాలన్, ప్రమోద్, వికాస్, గౌతమ్, సాగర్, నాయకులు రవి, వెంకటేష్, శ్రీను, రాజు, సాయి, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.