సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ కొరకు ఏర్పాట్లు పూర్తి
గాండ్లపెంట మండలంలోరెండవ విడత స్థానిక ఎన్నికల్లో భాగంగా గాండ్ల పెంట మండలంలో 14 సర్పంచ్ స్థానాలకు, 132 వార్డు సభ్యుల స్థానాలకు నామి నేషన్లను
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్వీకరించడం కోసం ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని ఎంపిడిఓ రామకృష్ణ తెలిపారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా గాండ్లపెంట మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయం నందు మద్దివారిగొంది, మలమీద పల్లి, గాండ్లపెంట మేజర్ పంచాయితీల నామినేషన్లను సి.రెడ్డి వరప్రసాద్ మండల ఇంజనీ రింగ్ అధికారి స్వీకరిస్తారని, కురుమామిడి గ్రామ సచివాలయం నందుచామలగొంది, జి. పెద్ద తండా, వేపరాల, కురు మామిడి పంచాయి
తీల నామినేషన్లను మండల వ్యవసాయ శాఖ అధికారి షాదాబ్ స్వీక రిస్తారని, కటారుపల్లి సచివాలయం నందుకటారుపల్లి,గొడ్డువెలగల, టీ పెద్ద తాండ, తుమ్మల బైలు పంచాయితీల నామినేషన్లను మండల విద్యాశాఖ అధికారి -1 కృష్ణ నాయక్ స్వీకరిస్తా రని,సోమయాజులపల్లి సచివాలయం నందు తూపల్లి, సోమయాజులపల్లి, జీనులకుంట పంచా యతీల నామినేషన్ల ను మండల విద్యా శాఖ అధికారి 2 శ్రీనివాసులు స్వీకరి స్తారని ఆయన తెలిపారు. ఈనెల 18వ తేదీన ఎన్నికల నోటిఫి కేషన్ విడుదల అవుతుందని, ఆ రోజు నుండే నామినేషన్ల స్వీకరణ చేయబడుతుందని, 19,20 వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ సాగుతుం దని 21వ తేదీ నామినేషన్ల పరిశీ లన, 22, 23వ తేదీలలో తిరస్కరణ నామినేషన్లపై ఆర్డిఓ చేత విచారణ అనంతరం 24వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు నామి నేషన్లఉపసంహరణ కార్యక్రమం అనం తరం బరిలో నిలిచిన అభ్యర్థు లకు ఈనెల 24వ తేదీన గుర్తులు కేటాయించడం జరుగుతుందని, తదుపరి ఎన్నికలు స్టేజ్ 2 మొదలు కావడం జరుగుతుం దని ఎంపీడీఓ రామకృష్ణ తెలిపారు.