అనంత రూరల్ లో ప్రశాంతంగా ఎన్నికల నామినేషన్లు
తొలి రోజు 117 నామినేషన్లు
- సర్పంచ్ స్థానాలకు 54, వార్డు సభ్యులకు 63 నామినేషన్లు
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ : అనంతపురం రూరల్ మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు స్వీకరణ తొలి రోజు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మండలంలో
24 గ్రామాల సర్పంచుల స్థానాలకు.. ఆకుతోటపల్లి 2, అనంతపురం రూరల్, కక్కలపల్లి, రుద్రంపేట, రాజీవ్ కాలనీ, కురుగుంట, కక్కలపల్లి కాలనీలలో గ్రామ సచివాలయాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలలో.. రాజకీయ పార్టీలకు చెందిన సర్పంచ్ అభ్యర్థుల నుంచి నామినేషన్లను ఎన్నికల అధికారులు స్వీకరించారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల అధికారులు నామినేషన్లను స్వీకరించారు. తొలి రోజు మండలంలో వివిధ గ్రామాల నుంచి మొత్తం 117 నామినేషన్లు వచ్చాయని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ పి దివాకర్ తెలిపారు. ఇందులో సర్పంచి స్థానాలకు 54 నామినేషన్లు, వార్డు సభ్యులకు 63 నామినేషన్లు స్వీకరించినట్లు తెలిపారు.
నామినేషన్ల స్వీకరణ సందర్భంగా ఆయా కేంద్రాల పెద్ద పోలీసులు పట్టిష్ట బందోబస్తు నిర్వహించారు.