చినమామిడిపల్లిలో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం
నర్సాపురం, మేజర్ న్యూస్ :కార్తీకమాసం ను పురస్కరించుకుని త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక మామిడికుదురు కమిటీఆధ్వర్యంలో ఆదివారం పట్టణం లోని చిన్న మామిడిపల్లి లో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం చేశారు.ఒక జ్ఞాని అయినా ఒక అజ్ఞాని అయినా జీవించి ఉన్నప్పుడే శ్రద్ధతో ఙ్ఞానాన్ని పొందాలి. పొందిన జ్ఞానం తో యోగ సాధన చేసి ఆయువు ను సద్వినియోగం చేసుకోవాలి అనే ఉద్దేశం తో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు కోవాలని తెలిపారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కార్తీక మాసంలో అందరూ దీపాలు వెలిగించడం తో పాటు అందులో ఇమిడి ఉన్న జ్ఞానం కూడా తెలుసుకోవాలి అన్నారు.
కార్యక్రమంలో త్రైతసిద్ధాంతం-ప్రబోధసేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక- మామిడికుదురు కమిటీ అధ్యక్షుడు, సభ్యులు బండారు సత్యనారాయణ,హనుమంతరావు, బ్రహ్మజీ, లక్ష్మీ, సత్యవతి లు పాల్గొన్నారు.