తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం
తిరుమల మేజర్ న్యూస్,
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ బస్సును ఎడమవైపు నుంచి ఓవర్‌టేక్ చేసే క్రమంలో ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి ఆర్టీసీ బస్సు
కిందపడిపోయాడు. వినాయక స్వామి ఆలయం దాటిన తర్వాత వచ్చే మలుపు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు, అతడిని వెంటనే తిరుపతిలోని రూయా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని తిరుపతికి చెందిన పునీత్ రెడ్డిగా గుర్తించారు.ప్రమాద ఘటనను గమనించిన ఎస్పీఎఫ్ సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రుడికి సహాయం అందించారు.
తిరుమల రిపోర్టర్ ,
టి .వెంకట్ రాజ్