BREAKING
భక్తిభావానికి ప్రతిరూపం "పడాల" అనంత రూరల్ లో ప్రశాంతంగా ఎన్నికల నామినేషన్లు మెగా కుటుంబం నుంచి మరో యంగ్ హీరో సందడి.. ఘనంగా కొణిదెల పవన్ తేజ్ 'జంట' టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం పటాన్‌చెరు మినీ ఇండియా.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక! నీలం మధు ముదిరాజ్ ఆసక్తికరంగా 'మోసపోయాం జానకి' టైటిల్ పోస్టర్.. రద్దు చేసిన పాత నోట్లతో సరికొత్త క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ కోరా జాన్సన్ ఏఎన్‌సీ పాఠశాలల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు చినమామిడిపల్లిలో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం భారత్‌లో సైలెంట్‌ కిల్లర్‌గా మారుతున్న మధుమేహం - కరీంనగర్ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ మానవతా సంస్థ రెండు కుటుంబాలకు ఆర్థిక ఆసరా. కుంచెతో మెరిసిన చిన్నారులు - పారమిత వరల్డ్ స్కూల్  ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ అడ్వకేట్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి. సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆరా ఇగ్నైట్స్ ట్రస్ట్ అండ్. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు. 50 కిలోల బియ్యం అందజేత

అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆరా ఇగ్నైట్స్ ట్రస్ట్ అండ్.

Select Suryaa Now
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆరా ఇగ్నైట్స్ ట్రస్ట్ అండ్.

కళ్యాణదుర్గం: ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకోవడమే లక్ష్యంగా ఆరా ఇగ్నైట్స్ సేవా సంస్థ మరోసారి సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. కళ్యాణదుర్గం పట్టణంలోని మారేంపల్లి ప్రాంతానికి చెందిన లక్ష్మి అనే మహిళ అరుదైన స్వయం ప్రతిరక్షక వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న సంస్థ సభ్యులు ఆమె కుటుంబానికి అండగా నిలిచారు. ఈ వ్యాధి కారణంగా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ సొంత కణజాలాలపైనే దాడి చేస్తుండటంతో ముఖ్యంగా ఆమె మూత్రపిండాలపై ప్రభావం పడింది. దీంతో వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్స పొందుతున్నారు. వ్యాధి చికిత్సలో భాగంగా ప్రతినెలా మందులు, రక్త పరీక్షలకు సుమారు రూ.30 వేల వరకు ఖర్చవుతోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబానికి వైద్య ఖర్చులు భారంగా మారాయి. ఈ పరిస్థితిని గుర్తించిన ఆరా ఇగ్నైట్స్ సేవా సంస్థ గత ఆరు నెలలుగా ప్రతినెలా అవసరమైన మందులు, రక్త పరీక్షలను ఉచితంగా అందిస్తూ బాధితురాలికి అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం సంస్థ సభ్యులు లక్ష్మి కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భవిష్యత్తులోనూ అవసరమైన వైద్య సహాయాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామని సంస్థ ప్రతినిధులు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలను గుర్తించి తమ వంతు సహాయం అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కష్టకాలంలో బాధితులకు అండగా నిలవడం నిజమైన మానవత్వమని పేర్కొన్నారు. లక్ష్మి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు లోకేష్, ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజేష్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సాయి శరణ్, నిర్వహణ కార్యదర్శి చల్లా శ్రీకాంత్ నాయుడు, అదనపు కార్యదర్శి సాయిరాం, ఖజానాదారు రమేష్, సభ్యులు నరహరి, సందీప్, ఉమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరు నెలలుగా ఉచిత వైద్య సహాయం అందిస్తూ, తాజాగా ఆర్థిక సహాయం కూడా అందించిన ఆరా ఇగ్నైట్స్ సేవా సంస్థ సభ్యుల సేవలను పలువురు అభినందిస్తున్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.