BREAKING
భక్తిభావానికి ప్రతిరూపం "పడాల" అనంత రూరల్ లో ప్రశాంతంగా ఎన్నికల నామినేషన్లు మెగా కుటుంబం నుంచి మరో యంగ్ హీరో సందడి.. ఘనంగా కొణిదెల పవన్ తేజ్ 'జంట' టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం పటాన్‌చెరు మినీ ఇండియా.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక! నీలం మధు ముదిరాజ్ ఆసక్తికరంగా 'మోసపోయాం జానకి' టైటిల్ పోస్టర్.. రద్దు చేసిన పాత నోట్లతో సరికొత్త క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ కోరా జాన్సన్ ఏఎన్‌సీ పాఠశాలల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు చినమామిడిపల్లిలో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం భారత్‌లో సైలెంట్‌ కిల్లర్‌గా మారుతున్న మధుమేహం - కరీంనగర్ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ మానవతా సంస్థ రెండు కుటుంబాలకు ఆర్థిక ఆసరా. కుంచెతో మెరిసిన చిన్నారులు - పారమిత వరల్డ్ స్కూల్  ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ అడ్వకేట్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి. సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆరా ఇగ్నైట్స్ ట్రస్ట్ అండ్. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు. 50 కిలోల బియ్యం అందజేత

యువతకు ఉద్యోగాల కల్పనలో ఏపీ దేశానికే ఆదర్శం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Select Suryaa Now
యువతకు ఉద్యోగాల కల్పనలో ఏపీ దేశానికే ఆదర్శం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

విజయనగరం, మేజర్ న్యూస్:

దేశంలో ఏ రాష్ట్రం తీసుకోని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో యువతకు ఉద్యోగాల కల్పన కోసం కూటమి ప్రభుత్వం విస్తృతమైన చొరవ తీసుకుంటోందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ (MSME), సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ప్రవాహంపై కీలక విషయాలను వెల్లడించారు.

పెట్టుబడుల వెల్లువ.. 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం:

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధికి విస్తృతంగా కార్యాచరణ అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. గత మూడు నెలల్లో 5 దేశాల్లో పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ప్రచారం నిర్వహించామని, ఇప్పటివరకు రూ. 33 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. '31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్-2026' ద్వారా 714 ప్రాజెక్టులకు గాను రూ. 22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటి ద్వారా సుమారు 19 లక్షల ఉద్యోగాల కల్పనకు సిద్ధమవుతున్నామని వివరించారు. నేడు ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

స్థానికంగానే ఉపాధి.. విజయనగరానికి రూ. 2,700 కోట్లు:

ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నానికి ఒక ప్రత్యేక బ్రాండ్ తీసుకువచ్చి, పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలను ఆకర్షించారని కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అంతరిక్ష సంబంధిత (స్పేస్ రిలేటెడ్) పరిశ్రమలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రూ. 3,800 కోట్లతో బల్క్ ఇండస్ట్రీలకు కేటాయింపులు జరపడంతో పాటు, స్థానిక యువతకు సొంత ప్రాంతంలోనే ఉపాధి కల్పించేందుకు ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ (MSME) పార్కులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒక్క విజయనగరం జిల్లాకే రూ. 2,700 కోట్ల పైచిలుకు పెట్టుబడులు వచ్చాయని, శ్రీకాకుళంలో గెయిల్, కోరమాండల్ వంటి దిగ్గజ సంస్థలు అడుగుపెట్టాయని వెల్లడించారు.

ఉత్తరాంధ్రకు బొత్స ఏం చేశారో చెప్పాలి:

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనపై మంత్రి కొండపల్లి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క కంపెనీని కూడా వారు నిలుపుకోలేకపోయారని, కనీసం ఎయిర్‌పోర్ట్‌కు ఒక ప్రహరీ గోడ కూడా నిర్మించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇన్నేళ్లుగా ఉత్తరాంధ్రకు నాయకత్వం వహించిన బొత్స సత్యనారాయణ ఈ ప్రాంతానికి, విజయనగరం జిల్లాకు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. బొత్స ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియాలని మంత్రి విమర్శించారు.

శ్రీనివాస్ బ్యూరో విజయనగరం