telangana
కుంచెతో మెరిసిన చిన్నారులు - పారమిత వరల్డ్ స్కూల్ ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు
సూర్య తిమ్మాపూర్ : చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు పారమిత వరల్డ్ స్కూల్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ లోని ఉపగ్న హోమ్స్ వేదికగా నిర్వహించిన చిత్రలేఖన పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీలకు ఒకటవ తరగతి నుండి పడవ తరగతి వరకు సుమారు 50 మంది చిన్నారులు హాజరై తమ కుంచెకు పనిచెప్పారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ గుజ్జుల శ్వేత విచ్చేసి, చిన్నారులు వేసిన చిత్రాలను పరిశీలించి అభినందించారు. అనంతరం సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పొలం మల్లేష్, ఉపగ్న హోమ్స్ అధ్యక్షుడు సిహెచ్. రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు సాగర్, ప్రధాన కార్యదర్శి సుధాకర్, పాఠశాల డైరెక్టర్స్ ప్రసూన, వి.యు.ఎం. ప్రసాద్, ప్రధానాచార్యులు శ్రీకర్, విద్యా సమన్వయకర్త దీప్తిరాణి, ఉపాధ్యాయులు, కాలనీ నివాసితులు తదితరులు పాల్గొన్నారు.