BREAKING
భక్తిభావానికి ప్రతిరూపం "పడాల" అనంత రూరల్ లో ప్రశాంతంగా ఎన్నికల నామినేషన్లు మెగా కుటుంబం నుంచి మరో యంగ్ హీరో సందడి.. ఘనంగా కొణిదెల పవన్ తేజ్ 'జంట' టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం పటాన్‌చెరు మినీ ఇండియా.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక! నీలం మధు ముదిరాజ్ ఆసక్తికరంగా 'మోసపోయాం జానకి' టైటిల్ పోస్టర్.. రద్దు చేసిన పాత నోట్లతో సరికొత్త క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ కోరా జాన్సన్ ఏఎన్‌సీ పాఠశాలల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు చినమామిడిపల్లిలో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం భారత్‌లో సైలెంట్‌ కిల్లర్‌గా మారుతున్న మధుమేహం - కరీంనగర్ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ మానవతా సంస్థ రెండు కుటుంబాలకు ఆర్థిక ఆసరా. కుంచెతో మెరిసిన చిన్నారులు - పారమిత వరల్డ్ స్కూల్  ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ అడ్వకేట్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి. సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆరా ఇగ్నైట్స్ ట్రస్ట్ అండ్. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు. 50 కిలోల బియ్యం అందజేత

రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో రంగారెడ్డి, మెదక్ జట్లు ఛాంపియన్లు

Select Suryaa Now
రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో రంగారెడ్డి, మెదక్ జట్లు ఛాంపియన్లు
సూర్య కరీంనగర్ : నగరంలోని సెయింట్ ఆల్ఫోన్స్ ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహించిన 70వ రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్‌-17 బాలబాలికల బాస్కెట్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. బాలుర విభాగంలో రంగారెడ్డి, బాలికల విభాగంలో మెదక్ జట్లు ఛాంపియన్లుగా నిలిచాయి. బాలుర విభాగంలో హైదరాబాద్ రన్నరప్, నిజామాబాద్ తృతీయ స్థానంలో నిలవగా, బాలికల విభాగంలో నిజామాబాద్ రన్నరప్, హైదరాబాద్ తృతీయ స్థానాన్ని సాధించాయి. ముగింపు కార్యక్రమంలో డీఈఓ తిరుపతిరావు విజేతలకు ట్రోఫీలు, పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను పెంపొందిస్తాయని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంతోష్ రెడ్డి క్రీడల ప్రాధాన్యతను వివరించారు. జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి క్రీడా నివేదిక సమర్పించారు. రాష్ట్రస్థాయి పరిశీలకులు రమేష్, సునీత, బాబు శ్రీనివాస్, ఆడెపు శ్రీనివాస్, అంతటి శంకరయ్య, డి.సత్యానంద్, సునీల్, అనిల్, శ్రీధర్ రావు, ఎల్.బన్సీలాల్, జీవన్ భార్గవ్, సుమారు 80 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జాతీయస్థాయి పోటీల కోసం బాలబాలికల విభాగాల్లో 15 మంది చొప్పున క్రీడాకారులను రాష్ట్ర జట్లకు ఎంపిక చేశారు.