తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ అడ్వకేట్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి. సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
సంగారెడ్డి ; సంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. సంజీవరెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ అడ్వకేట్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.న్యాయవాదుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం ఆయన అందిస్తున్న సేవలు, నాయకత్వ ప్రతిభకు గుర్తింపుగా ఈ పదవి లభించింది. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు, ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలిపారు.సంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతూ రాష్ట్రస్థాయి న్యాయవాదుల సంఘంలో కీలక బాధ్యతలు చేపట్టడం పట్ల జిల్లా న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో న్యాయవాదుల అభ్యున్నతికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.సంగారెడ్డి జిల్లా నుంచి రాష్ట్రస్థాయి బాధ్యతలు చేపట్టడం న్యాయవాదులకు గర్వకారణంగా నిలిచింది.