నల్లచెరువు టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా తాటిచెర్ల వహీదా.. టీడీపీ మండల కన్వీనర్ రాజశేఖర్ బాబు
నల్లచెరువు మేజర్ పంచాయతీ టిడిపి అభ్యర్థిగా తాటిచెర్ల వహీదా పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు మండల కన్వీనర్ రాజశేఖర్ బాబు తెలియ జేశారు. ఆదివారం మండల కేంద్రంలోని మిల్లులో టిడిపి సీనియర్ నాయ కులు కార్యకర్తలు సమావేశంనిర్వహించి రానున్న సర్పంచ్ ఎన్నికలలో భాగంగా నల్ల చెరువు మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాలు మేరకు మాజీ ఎంపీపీ టిడిపి సీనియర్ నాయకులు తాటి చెర్ల మహబూబ్ సతీమణి తాటిచెర్ల వహీదా పేరును ప్రకటిస్తున్నామని తెలియజేశారు. మిగిలిన 12 పంచాయతీల టిడిపి సర్పంచ్ అభ్యర్థుల పేర్లను అతి త్వరలోనే ప్రకటించినట్లు ఆయన తెలియ జేశారు. పలువురు నాయకులు మాట్లా డుతూ నాయకులు అందరూకలిసికట్టుగా కదలి వచ్చి నల్ల చెరువు సర్పంచ్ అభ్యర్థిని తాటిచెర్ల వహీదాను అత్య ధిక మెజారిటీతో గెలిపించి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కు కానుకగా అందజే యాలనిపేర్కొన్నారు. మాజీ మండల కన్వీనర్ దాదెం వెంకటశివారెడ్డి, నల్లబోతుల అశ్వర్థ నాయుడు, మైనా రిటీజిల్లానాయకులు బషీర్ అహ్మద్, ఎంపీటీసీలు రాజశేఖర్ రెడ్డి, ఉత్తప్ప, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ ఎద్దుల అంజనప్ప, యువ జన నాయకులు దాదెం రాజశేఖర్ రెడ్డి, తనకల్లు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ లక్ష్మీనారా యణ, సింగల్ విండో డైరెక్టర్ గంగులప్ప, వేమ య్య, శ్రీనివాసులు, సుభహాన్, ఆది నారాయణ తదితర నాయకులు, కార్య కర్తలు, పెద్దఎత్తున పాల్గొన్నారు.