BREAKING
భారత్‌లో సైలెంట్‌ కిల్లర్‌గా మారుతున్న మధుమేహం - కరీంనగర్ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ మానవతా సంస్థ రెండు కుటుంబాలకు ఆర్థిక ఆసరా. కుంచెతో మెరిసిన చిన్నారులు - పారమిత వరల్డ్ స్కూల్  ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ అడ్వకేట్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి. సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆరా ఇగ్నైట్స్ ట్రస్ట్ అండ్. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు. 50 కిలోల బియ్యం అందజేత సాధన అద్వితీయమైన శక్తి ఈజిప్ట్‌లో గ్యాస్ ఇందన ప్రారంభించిన షెల్ రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో రంగారెడ్డి, మెదక్ జట్లు ఛాంపియన్లు వైభవంగా ఛత్ పూజ వేడుకలు.. ప్రకృతి ఆరాధనతో మార్మోగుతున్న నదీ తీరాలు ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించిన సుడా మాజీ చైర్మన్  తెలంగాణ హమాలీ మిల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కు సారంగపాణి 101 జంటలతో ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం యువతకు ఉద్యోగాల కల్పనలో ఏపీ దేశానికే ఆదర్శం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అద్విత ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు - ‘రెట్రోవర్స్–2026’ పేరుతో 80వ దశకపు బాల్యపు మధుర జ్ఞాపకాల సందడి

Select Suryaa Now
అద్విత ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు - ‘రెట్రోవర్స్–2026’ పేరుతో 80వ దశకపు బాల్యపు మధుర జ్ఞాపకాల సందడి
సూర్య కరీంనగర్ : భగత్‌నగర్‌లోని అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘అద్విత రెట్రోవర్స్–2026’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 1980వ దశకపు బాల్యపు మధుర జ్ఞాపకాలను గుర్తుచేస్తూ పాఠశాల ప్రాంగణాన్ని ఆనాటి పాతకాలపు వాతావరణం, రంగురంగుల అలంకరణలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.‘నో స్క్రీన్స్ – నో స్ట్రెస్ – జస్ట్ చైల్డ్‌హుడ్’ అనే సందేశంతో నిర్వహించిన ఈ వేడుకలో సంప్రదాయ ఆటలు, పాతకాలపు ఛాయాచిత్రాలు, ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు, నృత్యాలు, నాటకాలు, పుస్తకాలు, గాజులు, పూలు, కుమ్మరి కళలు, సంప్రదాయ ఆహారపు స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు.ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ చిన్ననాటి అనుభవాలను పిల్లలతో పంచుకుంటూ ఆనాటి ఆటలు, సంప్రదాయాలను పరిచయం చేశారు. కుటుంబ సభ్యులందరూ కలిసి మధుర జ్ఞాపకాలను సృష్టించుకునే వేదికగా రెట్రోవర్స్ నిలిచింది.పాఠశాల డైరెక్టర్ అనుదీప్ సౌగాని దార్శనికత, ప్రోత్సాహం, సహకారంతో వేడుక విజయవంతమైంది. కార్యక్రమ నిర్వహణలో కృషిచేసిన వైస్ ప్రిన్సిపల్, నిర్వాహక బృందం, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులను పాఠశాల ప్రిన్సిపాల్ అభినందించారు. రెట్రోవర్స్ కేవలం కార్నివాల్ మాత్రమే కాదని, ప్రతి ఒక్కరినీ బాల్యంలోకి తీసుకెళ్లిన మధుర జ్ఞాపకాల ప్రయాణమని ఆమె పేర్కొన్నారు.