BREAKING
సంగీత సాహిత్య సాంస్కృతిక రాజధాని విజయనగరం - మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాచర్ల : పురాతన ఆలయాకృతికి పూర్వవైభవం-ఎమ్మెల్యే జేబీఆర్ ఆపదలో ఉన్న కుటుంబానికి ఆపన్నహస్తం జంట" మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ ఈవెంట్ నల్లచెరువు టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా తాటిచెర్ల వహీదా.. టీడీపీ మండల కన్వీనర్ రాజశేఖర్ బాబు ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యం మోసపోయాం జానకి" టైటిల్ అనౌన్స్ మెంట్ యువత సేవా కార్యక్రమాలు చేపట్టాలి.. టీడీపీ యువనేత ధర్మవరం గౌతమ్ రెడ్డి... ఘనంగా గౌతమ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.. ఐదువందల మందికి అన్నదానం... గజపతినగరంలో వైసీపీ షాక్ మంత్రి తుమ్మల జన్మదిన వేడుకలు నిర్వహణ**అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు* మదనపల్లె పట్టణంలో వెల్లివిరిసిన మతసామరస్యం : హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారులకు భిక్ష : హాజరైన ట్రాఫిక్ సిఐ చాన్ బాషా,కామకోటి ప్రసాదరావు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా "మణిమ" సినిమా ప్రారంభం వైఎస్సార్‌సీపీ ప్రచారానికి గణాంకాలతోనే సమాధానం: చిన్న శ్రీను పెనుగొండలో ఘనంగా ఆంజనేయస్వామి పునఃప్రతిష్టాపన మహోత్సవం భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకల్లో బోరంచు శ్రీకాంత్ రెడ్డి

ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యం

Select Suryaa Now
ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యం

 

పెండింగ్ సమస్యలపై రాష్ట్ర అధ్యక్షుడు ఆస్కార్ రావు ఆగ్రహం

చిత్తూరు ప్రతినిధి, మేజర్ న్యూస్:వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జి. ఆస్కార్ రావు విమర్శించారు. ఉద్యోగుల సమస్యలు అధికారులకు అలుసుగా మారాయా అని ప్రశ్నించారు.చిత్తూరు లోని ఎల్.జి.బి. టవర్స్‌లో జిల్లా అధ్యక్షుడు ఎ. లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, రెండో ఏఎన్‌ఎంలకు జీతాల పెంపు, ఖాళీల భర్తీ, మొబైల్ యాప్‌ల పనిభారం తగ్గింపు తదితర సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

గతంలో ఉన్నతాధికారులతో సుమారు 30 సమస్యలపై చర్చించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని తీర్మానించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, బదిలీ సౌకర్యం కల్పించాలని, అర్హులైన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కోరారు.

జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

సమావేశంలో యూనియన్ చిత్తూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎ. లక్ష్మీనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి. శ్రీనివాస్ మూర్తి, కార్యదర్శిగా కె.ఆర్. జ్ఞానశేఖర్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా కె. భానుప్రకాష్, కోశాధికారిగా జె. చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. మోహన్ శెట్టి, తాష్కెంట్, విజయ్, సతీష్, సురేష్, అమ్ములు, విజయం తదితరులు సభ్యులుగా ఎన్నికయ్యారు.ఈ సమావేశంలో ఉద్యోగ వేదిక సెక్రటరీ జనరల్ శ్రీకాంత్ రాజు, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రమణ, రాష్ట్ర కోశాధికారి బాబాసాహెబ్, జోనల్ అధ్యక్షుడు శ్రీనివాస్ మూర్తి, వివిధ తాలూకాల ప్రతినిధులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.