సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : హీరాసుకా ఆదివాసీ జాగృతి వెల్ఫేర్ సొసైటీ, ఆదిలాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలకు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదిలాబాద్‌లోని రైల్వే స్టేషన్ సమీపంలో గల అయన విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని బిర్సా ముండా విగ్రహానికి ఆదివాసీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు సిడాం రాంకిషన్ ఆదివాసీ సంఘాల నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.