BREAKING
భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా "మణిమ" సినిమా ప్రారంభం వైఎస్సార్‌సీపీ ప్రచారానికి గణాంకాలతోనే సమాధానం: చిన్న శ్రీను పెనుగొండలో ఘనంగా ఆంజనేయస్వామి పునఃప్రతిష్టాపన మహోత్సవం భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకల్లో బోరంచు శ్రీకాంత్ రెడ్డి బాబ్ ఎల్-మండబ్ జలసంధి సమీపంలో యెమెన్ ప్రభుత్వ బలగాల ఉపసంహరణ గతాన్ని వీడి.. బాధ్యతగా జీవించండి చిట్టి వ్యాపారి పరార్ - కటకటాల లోకి భార్య వైశాలి దంపతుల పేరిట మోసం మైత్రి సేతు యాత్ర.. భారత్, శ్రీలంక ఎన్‌సీసీ కేడెట్ల ఆధ్వర్యంలో 3550 కిలోమీటర్ల సైకిల్ యాత్ర ప్రారంభం పత్రికలో కథనం వచ్చినా మారని తీరు.. పంచాయతీ కార్యదర్శికి ప్రజల సమస్యలు పట్టవా?.......గతంలో పారిశుద్ధ్య లోపాలపై వార్త ప్రచురణ.. అయినా పనులు చేపట్టని వైనం.. కాలువ పూర్తిగా మూసుకుపోతున్నా స్పందన కరువు.. ఇలాంటి నిర్లక్ష్యపు కార్యదర్శిని ఎప్పుడూ చూడలేదంటున్న స్థానికులు! *పి.ఆర్.టి.యు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నిక ఏకగ్రీవం* విద్యార్థులు పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి నెక్సరియా వివాదంలో..డచ్ కోర్టు ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లనున్న వింగ్‌టెక్ బాలల హక్కుల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి - జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ ఎన్టీఆర్ వీరాభిమాని, టిటిడి ఎక్స్ బోర్డ్ మెంబర్ ఎన్టీఆర్ రాజు గారి సంవత్సరీకానికి హాజరైన నందమూరి కుటుంబ సభ్యులు, టిడిపి నాయకులు మెగాస్పీడ్ సంస్థపై కీలక ప్రకటన..గత ఏడాది ఆగస్టులోనే తప్పుకున్న ఆలిస్ హువాంగ్

రాష్ట్రస్థాయి హాకీ టోర్నీలో నిజామాబాద్ జట్టు విజయం

Select Suryaa Now
రాష్ట్రస్థాయి హాకీ టోర్నీలో నిజామాబాద్ జట్టు విజయం
సూర్య బీబీపేట : మండల కేంద్రం లో తిమ్మయ్యగారి సుశీల నారాయణరెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా గత మూడు రోజులుగా అట్టహాసంగా నిర్వహిస్తున్న 70వ తెలంగాణ రాష్ట్రస్థాయి అండర్-14 బాలికల హాకీ టోర్నమెంట్ ఆదివారంతో ఘనంగా ముగిసింది.టోర్నమెంట్ చివరి రోజైన ఆదివారం నిర్వహించిన సెమీఫైనల్ పోటీల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఫైనల్ పోరులో నిజామాబాద్, మహబూబ్‌నగర్ జట్లు తలపడగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాన్ని రాష్ట్రస్థాయి హాకీ కప్ ను కైవసం చేసుకుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో నిలవగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు తృతీయ స్థానాన్ని సాధించింది.ఈ సందర్భంగా టోర్నమెంట్ పరిశీలకులు నిరంజన్ గౌడ్, కామారెడ్డి ఎస్‌జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈద శ్రీధర్ విజేతలను ప్రకటించారు. టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ  అంగాల ఆంజనేయులు నేతృత్వంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి విజేతలకు ట్రోఫీలు అందజేశారు.ఈ సందర్భంగా ప్రథమ స్థానం సాధించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా క్రీడాకారులకు బంగారు పతకాలు, ద్వితీయ స్థానం సాధించిన మహబూబ్‌నగర్ జిల్లా క్రీడాకారులకు వెండి పతకాలు, తృతీయ స్థానం సాధించిన ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారులకు కాంస్య పతకాలు అందజేశారు.
- జాతీయ స్థాయి క్రీడాకారులకు ఎస్‌ఆర్ ఫౌండేషన్ అండ
రానున్న డిసెంబర్ 20వ తేదీ నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాలికా క్రీడాకారులను ఎంపిక చేశారు.జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలనే సంకల్పంతో ఎంపికైన రాష్ట్ర జట్టుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి ప్రకటించారు. జాతీయస్థాయి పోటీలకు సిద్ధమయ్యే క్రీడాకారులకు అత్యుత్తమ నైపుణ్యాలతో కూడిన శిక్షణ అందించేందుకు ఎస్‌ఆర్ ఫౌండేషన్ తరఫున ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేయాలని, క్రీడాకారులకు అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించాలని తన ఫౌండేషన్ ప్రతినిధులకు ఆదేశించారు.శిక్షణ శిబిరం నిర్వహణతో పాటు క్రీడాకారులకు అవసరమైన అన్ని ఖర్చులను ఎస్‌ఆర్ ఫౌండేషన్ ద్వారానే పూర్తిగా భరిస్తానని ఆయన సభాముఖంగా హామీ ఇచ్చారు. జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ జట్టు కప్ సాధించేలా తన వంతు పూర్తి సహకారం అందిస్తానని స్పష్టం చేశారు.క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి జాతీయస్థాయిలో రాణించే అవకాశాలు కల్పించేందుకు ఎస్‌ఆర్ ఫౌండేషన్ ముందుకు రావడం పట్ల క్రీడాభిమానులు, క్రీడా నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.