*పి.ఆర్.టి.యు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నిక ఏకగ్రీవం*
*అధ్యక్షులుగా రామిశెట్టి రంగారావు, ప్రధాన కార్యదర్శిగా గోరంట్ల విజయ్ అమృత కుమార్*
మధిర, సూర్య మేజర్ న్యూస్.
పి.ఆర్.టి.యు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఖమ్మం సంఘ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఆదివారం జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కలసి
జిల్లాశాఖ అధ్యక్షులుగా రామిశెట్టి రంగారావును, ప్రధాన కార్యదర్శిగా గోరంట్ల విజయ్అమృతకుమారును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గతంలో జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్న కట్టా శేఖర్ రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడంతో నూతన జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను ఎన్నుకోన్నారు. వీరితోపాటు
జిల్లా అసోసియేట్ అధ్యక్షులుగా ఆర్ బ్రహ్మా రెడ్డి, తాళ్లూరి చంద్రశేఖర్
గౌరవాధ్యక్షులుగా తులుపు నూరి రత్నకుమార్ ను ఎన్నుకున్నారు.ఎన్నికల పరిశీలకునిగా
పి ఆర్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా శేఖర్ రావు వ్యవహారించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు మోత్కూరి మధు యలమద్ది వెంకటేశ్వర్లు ఆఫీస్ ఇన్ ఛార్జ్ కందులు వెంకట నరసయ్యఅన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.