telangana
ఈ నెల 16న కలెక్టరేట్ లో బాలల ప్రజావాణి
సూర్య ఇందూర్ : బాలల హక్కుల వారోత్సవంను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఈ నెల 16న ప్రత్యేకంగా బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రతి సోమవారం యధావిధిగా కొనసాగే ప్రజావాణితో పాటే 16న బాలల ప్రజావాణి కొనసాగుతుందని అన్నారు. ప్రత్యేక బాలల ప్రజావాణిలో బాలబాలికలు విద్య, వైద్యం, రవాణా, సంక్షేమం తదితర సమస్యలను అర్జీల ద్వారా తెలియజేయవచ్చని సూచించారు. వాటిని సంబంధిత శాఖల అధికారులచే సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. బాలల ప్రజావాణికి వచ్చే పిల్లల సౌకర్యార్థం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయిస్తున్నామని అన్నారు.