BREAKING
ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యం ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యం ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యం మోసపోయాం జానకి" టైటిల్ అనౌన్స్ మెంట్ యువత సేవా కార్యక్రమాలు చేపట్టాలి.. టీడీపీ యువనేత ధర్మవరం గౌతమ్ రెడ్డి... ఘనంగా గౌతమ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.. ఐదువందల మందికి అన్నదానం... గజపతినగరంలో వైసీపీ షాక్ మంత్రి తుమ్మల జన్మదిన వేడుకలు నిర్వహణ**అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు* మదనపల్లె పట్టణంలో వెల్లివిరిసిన మతసామరస్యం : హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారులకు భిక్ష : హాజరైన ట్రాఫిక్ సిఐ చాన్ బాషా,కామకోటి ప్రసాదరావు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా "మణిమ" సినిమా ప్రారంభం వైఎస్సార్‌సీపీ ప్రచారానికి గణాంకాలతోనే సమాధానం: చిన్న శ్రీను పెనుగొండలో ఘనంగా ఆంజనేయస్వామి పునఃప్రతిష్టాపన మహోత్సవం భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకల్లో బోరంచు శ్రీకాంత్ రెడ్డి బాబ్ ఎల్-మండబ్ జలసంధి సమీపంలో యెమెన్ ప్రభుత్వ బలగాల ఉపసంహరణ గతాన్ని వీడి.. బాధ్యతగా జీవించండి చిట్టి వ్యాపారి పరార్ - కటకటాల లోకి భార్య వైశాలి దంపతుల పేరిట మోసం

పత్రికలో కథనం వచ్చినా మారని తీరు.. పంచాయతీ కార్యదర్శికి ప్రజల సమస్యలు పట్టవా?.......గతంలో పారిశుద్ధ్య లోపాలపై వార్త ప్రచురణ.. అయినా పనులు చేపట్టని వైనం.. కాలువ పూర్తిగా మూసుకుపోతున్నా స్పందన కరువు.. ఇలాంటి నిర్లక్ష్యపు కార్యదర్శిని ఎప్పుడూ చూడలేదంటున్న స్థానికులు!

Select Suryaa Now
పత్రికలో కథనం వచ్చినా మారని తీరు.. పంచాయతీ కార్యదర్శికి ప్రజల సమస్యలు పట్టవా?.......గతంలో పారిశుద్ధ్య లోపాలపై వార్త ప్రచురణ.. అయినా పనులు చేపట్టని వైనం.. కాలువ పూర్తిగా మూసుకుపోతున్నా స్పందన కరువు.. ఇలాంటి నిర్లక్ష్యపు కార్యదర్శిని ఎప్పుడూ చూడలేదంటున్న స్థానికులు!

పరిగి మండల కేంద్రంలోని పరిగి కాలనీ ప్రవేశ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్త వ్యర్థాలు, పారిశుద్ధ్య లోపాలపై గత అక్టోబర్ 30న సూర్య దినపత్రికలో ఫొటోలతో సహా ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి మార్గం చూపించాలనే ఉద్దేశంతో పత్రిక ఈ సమస్యను వెలుగులోకి తెచ్చింది. అయినప్పటికీ ఇంతవరకు సంబంధిత పంచాయతీ కార్యదర్శి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

కాలనీ ప్రవేశం వద్ద రహదారి పక్కనే చెత్త వ్యర్థాలు పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగి పరిసరాలు అధ్వానంగా మారాయి. ముఖ్యంగా చెత్త వ్యర్థాలు పేరుకుపోవడంతో కాలువ పూర్తిగా మూసుకుపోయే పరిస్థితి ఏర్పడింది. మురుగునీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతోంది. దుర్వాసనతో పాటు దోమలు, ఈగలు పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

వార్త ప్రచురితమైనా కార్యదర్శిలో చలనం ఏదీ?

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం పత్రికల బాధ్యత. అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ వార్త ప్రచురితమైతే సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. కానీ పరిగి కాలనీలో పరిస్థితి చూస్తుంటే పత్రికలో వచ్చిన కథనాన్ని కూడా పట్టించుకోని పరిస్థితి కనిపిస్తోందని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పత్రికా కథనాలకు విలువ లేదా? ప్రజల సమస్యలపై స్పందించాల్సిన అవసరం లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇలాంటి నిర్లక్ష్యపు కార్యదర్శిని ఎప్పుడూ చూడలేదు!

పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ, కాలువల శుభ్రత, చెత్త వ్యర్థాల తొలగింపు వంటి పనులపై కార్యదర్శి నిరంతరం పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. అయితే పరిగి కాలనీలో కనిపిస్తున్న పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. గతంలో ఎన్నడూ ఇలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరించే కార్యదర్శిని చూడలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతను విస్మరిస్తే సామాన్య ప్రజలు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు.

పత్రిక ప్రశ్నిస్తే సమాధానం పనులతో చెప్పాలి!

పత్రికలో వార్తలు ప్రచురించడం వ్యక్తిగత విమర్శల కోసం కాదు. ప్రజా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతోనే కథనాలు ప్రచురిస్తారు. అలాంటి కథనాలను బాధ్యతాయుతంగా స్వీకరించి క్షేత్రస్థాయిలో పనులు చేపట్టాలి. పత్రిక ప్రశ్నలకు సమాధానం మాటల్లో కాదు.. సమస్య పరిష్కారంతో చూపించాలి.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందిస్తారా?

పరిగి కాలనీలో పేరుకుపోయిన చెత్త వ్యర్థాలను తొలగించి, పూర్తిగా మూసుకుపోతున్న కాలువను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శి పనితీరుపై ఎంపీడీవో, జిల్లా పంచాయతీ అధికారులు దృష్టి సారించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని కోరుతున్నారు.

ప్రజల సమస్యలను పత్రిక వెలుగులోకి తెస్తోంది.. అయినా పరిష్కారం చూపించకపోతే అధికారుల బాధ్యత ఏమిటి? గతంలో వార్త ప్రచురితమైనా మారని పరిస్థితి ఇప్పటికైనా మారుతుందా? పరిగి కాలనీకి పరిశుభ్రత ఎప్పుడు వస్తుంది?

 

 పరిగి సూర్య రిపోర్టర్ నవీన్….