పెనుగొండలో ఘనంగా ఆంజనేయస్వామి పునఃప్రతిష్టాపన మహోత్సవం
లేపాక్ష : పెనుగొండలోని సోసలె వ్యాసరాయమఠంలో శ్రీ శ్రీ శ్రీ విద్యా శ్రీష స్వామీజీ వారి దివ్య హస్తాలతో శ్రీ ఆంజనేయస్వామి విగ్రహ పునఃప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, దివ్య ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, అడ్వకేట్, లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్ పరిగి వేణుగోపాల్ రావు పాల్గొని స్వామివారి ప్రత్యేక పూజల్లో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్వామీజీని లేపాక్షి ఆలయానికి విచ్చేయాలని ఆహ్వానించారు.