BREAKING
ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యం ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యం ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యం మోసపోయాం జానకి" టైటిల్ అనౌన్స్ మెంట్ యువత సేవా కార్యక్రమాలు చేపట్టాలి.. టీడీపీ యువనేత ధర్మవరం గౌతమ్ రెడ్డి... ఘనంగా గౌతమ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.. ఐదువందల మందికి అన్నదానం... గజపతినగరంలో వైసీపీ షాక్ మంత్రి తుమ్మల జన్మదిన వేడుకలు నిర్వహణ**అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు* మదనపల్లె పట్టణంలో వెల్లివిరిసిన మతసామరస్యం : హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారులకు భిక్ష : హాజరైన ట్రాఫిక్ సిఐ చాన్ బాషా,కామకోటి ప్రసాదరావు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా "మణిమ" సినిమా ప్రారంభం వైఎస్సార్‌సీపీ ప్రచారానికి గణాంకాలతోనే సమాధానం: చిన్న శ్రీను పెనుగొండలో ఘనంగా ఆంజనేయస్వామి పునఃప్రతిష్టాపన మహోత్సవం భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకల్లో బోరంచు శ్రీకాంత్ రెడ్డి బాబ్ ఎల్-మండబ్ జలసంధి సమీపంలో యెమెన్ ప్రభుత్వ బలగాల ఉపసంహరణ గతాన్ని వీడి.. బాధ్యతగా జీవించండి చిట్టి వ్యాపారి పరార్ - కటకటాల లోకి భార్య వైశాలి దంపతుల పేరిట మోసం

చిట్టి వ్యాపారి పరార్ - కటకటాల లోకి భార్య వైశాలి దంపతుల పేరిట మోసం

Select Suryaa Now
చిట్టి వ్యాపారి పరార్ - కటకటాల లోకి భార్య వైశాలి దంపతుల పేరిట మోసం
సూర్య నేరడి గొండ : వారు ఎవరో తెలియదు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నామంటూ 12 ఏళ్ల క్రితం ఇచ్చోడ కు వలస వచ్చారు. విద్యనగర్ కాలాని లో కిరాణా దుకాణం పెట్టుకొని నడుపుతున్నారు. కొత్తగా చిట్టి వ్యాపారం వ్యాపారం మొదలుపెట్టారు. వైశాలి మరో వైపు బ్యూటీ పార్లర్ వ్యాపారం చేస్తుంది.ఇంత వరకు బాగానే ఉంది. చిట్టి వ్యాపారి పరార్ కావడంతో, భార్య ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఈ సంఘటనతో వారి మోసపూరిత సంఘటనలుఒక్కొక్కటి వెలుగులోకి వచ్చాయి . ఇచ్చోడ లో సంచలనం కలిగించిన సంఘటనకు సంబంధించినది వివరాలు ఇలా ఉన్నాయి.  12 ఏళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ కు వచ్చి, విద్య నగర్ కాలనీ లో కిరాణా దుకాణం పెట్టుకున్నారు. తాము ప్రేమించుకొని,పెండ్లి చేసుకున్నామని, ఇరు వర్గాల వారి పెద్దలు అంగీకరించక పోవడంతో ఇచ్చోడ కు వలస వచ్చినట్లు చెప్పుకొచ్చారు. తమది మహారాష్ట్ర లోని నాగపూర్ నివాసం అని , తన పేరు నరేందర్, భార్య పేరు వైశాలి గా చెప్పుకున్నారు.చిరు వ్యాపారం తో.…ఇచ్చోడ లోని విద్య నగర్ కాలనీ లో చిన్న రూమ్ తీసుకొని కిరాణా దుకాణాము పెట్టారు. వైష్ణవి కిరాణ దుకాణం ఈ కాలనీ లో మినీ సూపర్ మార్కెట్ గా ఉండేది.కొన్నాళ్ళు తరువాత చిట్టి వ్యాపారం మొదలు పెట్టారు. కిరాణా దుకాణం, చిట్టి ల వ్యాపారం మూడు పూలు - ఆరు కాయలుగా సాగింది. మూడేళ్ల క్రితం విద్య నగర్ కాలనీ లో 25 లక్షల తో ఒక్క ఇల్లు కొనుగోలు చేసి, ఇల్లు ముందు గల రూమ్ ను సేటార్ గా చేసుకొని ఘనంగా గృహ ప్రవేశం చేశారు.అద్దె ఇంటి నుండి సొంత ఇంటికి మారడంతో చిట్టీల వ్యాపారం మరింత పెరిగింది.ఇది ఇలా ఉండగా కొందరి వద్ద పెద్ద మొత్తంలో అప్పు గా తీసుకొని, నెలనెల వడ్డీ చెల్లిస్తున్నట్లు ఇప్పుడు ప్పుడే తెలుస్తుంది.
- పిల్లలు లేరని... ప్రేమ పెళ్లి అంటూ అబద్ధం ప్రచారం....
వారు ప్రేమ పెళ్లి అంటూ అందరికీ అబద్ధం చెప్పుకొచ్చారు. నరేందర్ పరార్ కావడం తో బాధితులు ఇచ్చిన పిర్యాదు తో వైశాలి నీ పది రోజుల క్రితం పోలీసుల అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. ఇప్పుడు ఆమె ఆదిలాబాద్ సబ్ జైలు లో కటకటాల లెక్కిస్తుంది.
జైలుకు వెళ్ళిన వైశాలి తమ బంధువులకు సమాచారం ఇవ్వడంతో, నాగపూర్ నుండి రెండు రోజుల క్రితం ఇవ్వడంతో వైశాలి రెండవ అల్లుడు ఇచ్చోడ కు రావడంతో వారి అసలు నిజరూపం వెలుగు లోకి రావడం తో కాలనీ వాసుల అందరూ అవాక్కు అయ్యారు.
  వారి ఇద్దరిది ప్రేమ పెళ్లి కాదని, లేసి వచ్చారని వారి అల్లుడు తెలిపారు. వైశాలి కి ఇద్దరు కూతుళ్లు,కుమారుడు తో పాటు భర్త ఉన్నారని, భర్త రైల్వే ఉద్యోగి అని వారి బంధువులు తెలిపారు. పరార్ అయిన నరేందర్ అడ్రస్ తమకు తెలియదని, నరేందర్ కు కూడా భార్య, పిల్లలు ఉన్నట్లు తెలిపారు.పోలీసులు అరెస్టు చేయడం వల్లనే వైశాలి అడ్రస్ దొరికిందన్నారు. బెయిల్ పై వైశాలి వచ్చకనే అన్నీ విషయాలు తెలుస్తాయని వారి బంధువులు తెలిపారు.12 ఏళ్లు గా కాలనీ లో ఉంటున్న వారిద్దరూ వారి అసలు జీవితాలను గోప్యంగా ఉంచారని , వారు ఇంత కిలాడీలులా అంటున్నారు.నరేందర్ పెద్ద ఎత్తున్న డబ్బులతో పరారీ అయినట్లు తెలుస్తుంది. ప్రైవేట్ చిట్టీల వ్యాపారులను, వడ్డీ ఆశలతో మోసపోవద్దని పోలీసులు ప్రచారం చేస్తున్న, ప్రజలు మోసపోతూనే ఉన్నారు. కొత్తగా వచ్చే వారిని నుండి వారి యొక్క పూర్తి అడ్రస్ ఆధార కార్డు తీసుకోవాలి. కొత్తగా వచ్చే వారికి అప్పుడే ఇల్లు కిరాయి ఇవ్వాలి. పూర్తి వివరాలు తెలుసుకోకపోతే ఇలానే మోసపోతారు ప్రజలు ఇకనైనా తస్మాత్ జాగ్రత్త.