యువత సేవా కార్యక్రమాలు చేపట్టాలి.. టీడీపీ యువనేత ధర్మవరం గౌతమ్ రెడ్డి... ఘనంగా గౌతమ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.. ఐదువందల మందికి అన్నదానం...
డోన్ (రూలర్ న్యూస్), : యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆదర్శంగా నిలవాలని తెదేపా యువనేత ధర్మవరం గౌతమ్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి తనయుడు గౌతమ్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం స్థానిక ఎంఎస్‌ఆర్ క్యాంపు కార్యాలయంలో ధర్మవరం సుబ్బారెడ్డి యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ నలుమూలల నుంచి తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చి గౌతమ్ రెడ్డిని పూలమాలలు, శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కేకు కోసి సంబరాలు జరుపుకొన్నారు. అనంతరం పాత బస్టాండ్‌లోని సమైక్యాంధ్ర కట్ట వద్ద సుమారు 500 మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు, యపదిన్నె మాజీ సర్పంచి రామిరెడ్డి, తెలుగుయువత నాయకులు సిటీ కేబుల్ కిరణ్, చనుగొండ్ల కాశీ, సీసంగుంతల బాబ్ల్యూ యాదవ్, బి.ఎడ్ భాషా, పార్థురెడ్డి, కొండపేట హరిరెడ్డి, కోచెర్వు మహేశ్వరరెడ్డి, నీలం ప్రభాకర్, గంధం చరణ్, మిద్దెపల్లె గోపాల్, తిమ్మాపురం సుధాకర్, ఓబుళాపురం భాస్కర్ యాదవ్, ప్రసాద్ యాదవ్, ధర్మవరం రవి తదితరులు పాల్గొన్నారు.