ఆపదలో ఉన్న కుటుంబానికి ఆపన్నహస్తం
నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన పాఠశాల స్నేహితురాలు స్వాతి కుటుంబానికి 2006-07విద్యా సంవత్సరం చెల్లిన పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు.స్వాతి కుమారుడు కీ.శే. అభిలాష్ చారి మృతితో విషాదంలో ఉన్న కుటుంబాన్ని బ్యాచ్‌మేట్స్ అందరూ కలిసి పరామర్శించారు.అభిలాష్ చారి చిత్రపటానికి నివాళులర్పించి,స్వాతికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ సందర్భంగా బ్యాచ్‌మేట్స్ తరఫున రూ.28 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి అండగా నిలవాలని బ్యాచ్‌మేట్స్ విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా స్వాతి కుటుంబ పరిస్థితిని పరిశీలించి ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు లేదా ఇతర సంక్షేమ పథకాల ద్వారా శాశ్వత భరోసా కల్పించాలని కోరారు.