BREAKING
భారత్‌లో సైలెంట్‌ కిల్లర్‌గా మారుతున్న మధుమేహం - కరీంనగర్ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ మానవతా సంస్థ రెండు కుటుంబాలకు ఆర్థిక ఆసరా. కుంచెతో మెరిసిన చిన్నారులు - పారమిత వరల్డ్ స్కూల్  ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ అడ్వకేట్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి. సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆరా ఇగ్నైట్స్ ట్రస్ట్ అండ్. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు. 50 కిలోల బియ్యం అందజేత సాధన అద్వితీయమైన శక్తి ఈజిప్ట్‌లో గ్యాస్ ఇందన ప్రారంభించిన షెల్ రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో రంగారెడ్డి, మెదక్ జట్లు ఛాంపియన్లు వైభవంగా ఛత్ పూజ వేడుకలు.. ప్రకృతి ఆరాధనతో మార్మోగుతున్న నదీ తీరాలు ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించిన సుడా మాజీ చైర్మన్  తెలంగాణ హమాలీ మిల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కు సారంగపాణి 101 జంటలతో ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం యువతకు ఉద్యోగాల కల్పనలో ఏపీ దేశానికే ఆదర్శం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

ఒకవైపు వ్యవస్థలను విధ్వంసం చేస్తూ మరోవైపు నిరసనలా ? సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

Select Suryaa Now
ఒకవైపు వ్యవస్థలను విధ్వంసం చేస్తూ మరోవైపు నిరసనలా ? సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
సూర్య కరీంనగర్ : ఒక వైపు అన్ని వ్యవస్థలను విధ్వంసం చేస్తూ ప్రజాసౌమ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ భారత్ సమ్మిట్ లో రాహుల్ గాంధీ పాల్గొనడంపై నిరసన వ్యక్తం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు.స్థానిక ముకరంపుర లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అంతర్జాతీయ అంశాలపై పరిశోధన, విధానపరమైన చర్చలు జరిపి ప్రపంచంలో జరుగుతున్న అనేక అంశాలపై దృష్టి సారించడానికి వేదికగా భారత్ సమ్మిట్ నిర్వహిస్తే కేవలం కొంతమంది ఫాసిస్టులకు మాత్రమే కొమ్ముకాస్తూ 12 సంవత్సరాల క్రితం సంపన్నుల జాబితాలో 600 వ స్థానంలో ఉన్న ఆదానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 ఏండ్లలో 2 వ స్థానానికి ఎదిగాడని,వ్యాపారానికి, రాజకీయానికి మధ్య ఉన్న గీత చెరిపేసిన ఘనత బీజేపీ సొంతం అని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.రాహుల్ గాంధీ ప్రజల సమస్యలు తెలుసుకొంటూ బీజేపీ దురాగతాలను ఎండగడుతూ ఒక నిర్మాణాత్మకమైన మార్పుకోసం కృషి చేస్తుంటే తట్టుకోలేక బీజేపీ పీటలు కదులుతున్నాయని నిరసనలు చేస్తున్నారా అని నరేందర్ రెడ్డి ప్రశ్నించారు.సమ్మిట్ లో పాల్గొన్న రాహుల్ గాంధీ వివిధ దేశాల ప్రతినిధుల ప్రసంగాలు శ్రద్ధగా విని అనంతరం సుదీర్ఘంగా ప్రసంగించి దిశా నిర్దేశం చేసి ఢిల్లీ వెళ్తే రాహుల్ గాంధీ మధ్యలోనే వెళ్లిపోయారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని నరేందర్ రెడ్డి విమర్శించారు.గతంలో వీరు గెలవడం కోసం దొంగ ఓట్లను నమోదు చేపించేవారని ఇప్పుడేమో ఎస్ఐఆర్ పేరుతో అనుకూలంగా లేని ఓట్లను తొలగిస్తున్నారని నరేందర్ రెడ్డి ఆరోపించారు.ఈ విలేకరుల సమావేశంలో దండి రవీందర్,జీడి రమేష్,కుర్ర పోచయ్య,దన్నా సింగ్,మామిడి సత్యనారాయణ రెడ్డి,నాగుల సతీష్,సాయిరాం,భారీ,లక్కిరెడ్డి కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.