ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం 30 సమస్యలపై చర్చించినా ఉత్తర్వులు జారీ చేయలేదు – ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆస్కార్ రావు.
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్: చిత్తూరులోని ఎల్.జి.బి టవ ర్స్ సమావేశ మందిరంలో పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐఎ న్టీయూసీ అనుబంధం) చిత్తూరు జిల్లా కార్యవ ర్గ సమావేశం ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షుడు ఎ. లక్ష్మీనారాయణ అధ్యక్షత న జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు జి. ఆస్కార్ రావు ముఖ్యఅ తిథిగా హాజ రయ్యారు. రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు, వివిధ కేడ ర్ సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్ష ణమే పట్టించుకోవాలని కోరారు. ముఖ్యంగా, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సమాన పనికి సమాన వేత నం, రెండవ ఏఎ న్‌ఎంల జీతాల పెంపు, మొబైల్ యాప్‌ల అధిక భారం, ఖాళీల భర్తీ వంటి సమస్యలు అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు.
గత నెలలో రాష్ట్ర సచివాలయంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో సుమారు 30 సమస్యలు చర్చించినప్పటికీ ఇప్పటివరకు అధికారిక ఉత్తర్వులు వెలువడకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో ఆమోదించిన ప్రధాన తీర్మానాల ప్రకారం, గుర్తింపు పొందిన సంఘంతో అన్ని స్థాయిల్లో జాయింట్ మీటింగ్‌లు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలి, మొబైల్ ఓటీపీ ఆధారిత సర్వేలను, ముఖ్యంగా లేప్రసీ కేసుల ఇంటింటి సర్వేలను, రద్దుచేయాలని తీర్మానించారు. ఫీల్డ్ సిబ్బందిపై మొబైల్ యాప్‌ల అదనపు భారం తగ్గించాలి. ఫీల్డ్ ఫంక్షనరీలకు ఎఫ్‌ఆర్‌ఎస్ ఆధారిత హాజరు విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలి. స్వర్ణగ్రామ వార్డు సచివాలయ ఏఎన్‌ఎంలను గ్రామ పంచాయతీ, మున్సిపల్ శాఖల పరిధి నుంచి తొలగించి పూర్తిగా ఆరోగ్య శాఖ పరిధిలోకి తీసుకురావాలి. రెగ్యులర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ హోదాను "పబ్లిక్ హెల్త్ ఆఫీసర్"గా మార్చాలి. జీఓ 143, 32 అమలులో భాగంగా ఖాళీలను అదనపు పోస్టులుగా కాకుండా పదోన్నతుల ద్వారా మాత్రమే భర్తీ చేయాలని, అర్హత గల కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల సేవలను వెంటనే క్రమబద్ధీకరించాలి. రెండవ ఏఎన్‌ఎంలకు ఉద్యోగ భద్రత, సమాన వేతనం కల్పించాలి. అన్ని ఖాళీలను తక్షణమే పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని, డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకానికి శాఖాధిపతులకు అనుమతి ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు బదిలీ సౌకర్యం కల్పించాలని తీర్మానించారు. స్టాఫ్ నర్సుల హోదాను "నర్సింగ్ ఆఫీసర్లు"గా మార్చాలని, వార్డు ఏఎన్‌ఎంలకు 35 సీఎల్ అమలు చేయాలని, 2004కు ముందు క్రమబద్ధీకరణైన ఎల్‌టీ, ఫార్మసిస్ట్, ఎంపీహెచ్‌ఏలకు ఓపీఎస్ పెన్షన్ విధానం వర్తింపజేయాలని పేర్కొన్నారు. జిల్లా మెడికల్ & హెల్త్ జేఏసీ డిమాండ్లు, ఫీల్డ్ సిబ్బందికి అలవెన్సులు మంజూరు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎ. లక్ష్మీనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి. శ్రీనివాస్ మూర్తి, జిల్లా కార్యదర్శిగా కె.ఆర్. జ్ఞానశేఖర్, కోశాధికారిగా జె. చంద్రశేఖర్‌లతో పాటు కొత్త కమిటీ బాధ్యతలు స్వీకరించింది. సమావేశంలో అనేక తాలూకా స్థాయి నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. తమ సమస్యలకు యూనియన్ గట్టిగా నిలబడి పోరాడుతుందన్న ఆశతో సమావేశం ఉత్సాహంగా ముగిసింది.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్