మంత్రి తుమ్మల జన్మదిన వేడుకలు నిర్వహణ**అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు*
సూర్య,అశ్వారావుపేటతెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఆదివారం అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు.
అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షులు చెన్నంశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ రంగం, మార్కెటింగ్, సహకార రంగాలతో పాటు చేనేత, జౌళి రంగాల అభివృద్ధికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిన్నంశెట్టి సత్యనారాయణ, కాసాని పద్మ శేఖర్, వేల్పుల సత్యనారాయణ, లింగిశెట్టి వెంకటేశ్వరరావు, తాళం సూరి, ప్రసాద్, మందపాటి వెంకన్న బాబు, అల్లాడి రామారావు, అండ్రు నరసింహమూర్తి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ మునీర్ ఆర్ సి అశ్వరావుపేట