నెక్సరియా వివాదంలో..డచ్ కోర్టు ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లనున్న వింగ్‌టెక్
సూర్య బిజినెస్ డెస్క్: ప్రఖ్యాత డచ్ సెమీకండక్టర్ కంపెనీ నెక్సరియా యాజమాన్య నియంత్రణ మరియు కార్పొరేట్ వివాదంలో నెదర్లాండ్స్ కోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులపై చైనాకు చెందిన మాతృ సంస్థ వింగ్‌టెక్ టెక్నాలజీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. డచ్ కోర్టు జారీ చేసిన మధ్యంతర ఆదేశాలను సవాల్ చేస్తూ అప్పీల్‌కు వెళ్లనున్నట్లు వింగ్‌టెక్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ ఈ విషయాన్ని స్పష్టం చేయడంతో గ్లోబల్ టెక్నాలజీ మరియు వ్యాపార వర్గాలలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది.
నెక్సరియా కంపెనీ కార్యకలాపాలలో యజమాన్య సంస్థ వింగ్‌టెక్ జోక్యం చేసుకోకుండా అడ్డుకట్ట వేసేందుకు డచ్ కోర్టుకు చెందిన ఎంటర్‌ప్రైజ్ ఛాంబర్ ఇటీవల కఠినమైన అదనపు భద్రతా చర్యలను ఆదేశించింది. అయితే కోర్టు జారీ చేసిన ఈ నిర్ణయంలో తగిన వాస్తవ మరియు చట్టపరమైన ప్రాతిపదిక కొరవడిందని, అంతేకాకుండా ఇది చైనాలో కొనసాగుతున్న న్యాయపరమైన విచారణలలో అనుచిత జోక్యానికి దారితీస్తుందని వింగ్‌టెక్ తన వాదనలో పేర్కొంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ న్యాపయరమైన ప్రతిష్టంభన సెమీకండక్టర్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గత కొంతకాలంగా నెక్సరియా నిర్వహణ మరియు సరఫరా గొలుసు (సప్లై చైన్) అంశాలపై వింగ్‌టెక్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు రకరకాల మలుపులు తిరుగుతోంది. డచ్ కోర్టు నియమించిన అధికారుల అధికారాలను గౌరవించాలని, కంపెనీ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేందుకు సహకరించాలని కోర్టు ఆదేశించినప్పటికీ, యజమాన్య హక్కులపై వివాదం వీడలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో వింగ్‌టెక్ అప్పీల్‌కు సిద్ధమవడంతో రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.