గుడిసె రహిత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం - పట్టణ సర్పంచ్ రేఖ సుదర్శన్
సూర్య- బిక్కనూర్ : పట్టణాన్ని గుడిసె రహిత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు, పట్టణ సర్పంచ్ బల్యాల రేఖ సుదర్శన్ చెప్పారు. ఆదివారం మండల కేంద్రంలోని పాత హరిజనవాడలో ఇందిరమ్మ పథకం ద్వారా ద్యాగల నరేష్ కుటుంబ సభ్యులు నిర్మించుకున్న ఇంటిని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ పట్టణంలో ఇండ్లు లేని వారిని గుర్తించి ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్లు నిర్మించుకునేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె వివరించారు. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలని, లబ్ధిదారులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే తాను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దుంపల మోహన్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ తాటిపాముల లింబాద్రి, పార్టీ పట్టణ అధ్యక్షుడు అందే దయాకర్ రెడ్డి, డిసిసి కార్యదర్శి రాజబాబు గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు జనార్ధన్ రెడ్డి, కిరణ్, పాలకవర్గ సభ్యులు, లబ్ధిదారులు ఉన్నారు