వైసీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి తలారి రంగయ్య పిలుపు
వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి: మాజీ ఎంపీ తలారి రంగయ్య పిలుపు
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య పిలుపునిచ్చారు. శెట్టూరు లోని మాజీ ఎంపీపీ సోమనాథ రెడ్డి నివాసంలో మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ, ఎన్నికల్లో పార్టీ విజయానికి నాయకులందరూ సమిష్టిగా కలిసి పనిచేయాలని హితబోధ చేశారు. వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి, పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కోరారు.
ఈ సమావేశంలో మండల కన్వీనర్ MS హనుమంతరాయుడు, మాజీ ఎంపీపీ సోమనాథ రెడ్డితో పాటు వివిధ పంచాయితీల సర్పంచ్ అభ్యర్థులు, శెట్టూరు మండల స్థాయి వైసీపీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఖాసీం, నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్, సెట్టూరు.