BREAKING
చైనా గుప్పిట్లోనూ వీడని ఖనిజాల పట్టు గాండ్లపెంట ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా దూర్జటి శ్రీవల్లి ఈ నెల 16న కలెక్టరేట్ లో బాలల ప్రజావాణి ట్రంప్ జ్యుడిషియల్ నియామకాలకు రిపబ్లికన్ల షాక్ శౌర్య క్రియేషన్స్ పై సరికొత్త సినిమాలతో డైరెక్టర్, హీరో బోదాసు నరసింహం 12 గంటల పాటు అలుపెరుగని పరుగు.. ఆరోగ్యమే అసలైన సంపద! - 96, 72 కిలోమీటర్లు పరుగెత్తిన డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, జగిత్యాల రజినేష్ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ అన్ని రంగాల్లో ముందుండాలి -- యువకులకు వాలీబాల్ నెట్ కోసం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జోర్డాన్ చర్చిపై ఉగ్రదాడి కేసులో సంచలన తీర్పు..ముగ్గురు దోషులకు ఉరిశిక్ష విధించిన కోర్టు వైసీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి తలారి రంగయ్య పిలుపు రాష్ట్రస్థాయి హాకీ టోర్నీలో నిజామాబాద్ జట్టు విజయం వాసవి క్లబ్ రీజియన్ సెక్రటరీగా నూలి శ్రీనివాస్ దుర్కి గిరిజన గురుకులంలో ఘనంగా భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు. తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 గుడిసె రహిత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం - పట్టణ సర్పంచ్ రేఖ సుదర్శన్ భారత్-ఇటలీ మధ్య శాస్త్రీయ పరిశోధకుల సహకారానికి ప్రత్యేక నిధి ఏర్పాటు

*కొండకేగిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి* - *గోవింద నామస్మరణతో మారుమోగిన భీమ్‌గల్ పురవీధులు* - *భక్తజన సందోహం మధ్య వైభవంగా ఉత్సవ విగ్రహాల ఊరేగింపు* - *వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. బోనాలు, మంగళహారతులతో ఆధ్యాత్మిక శోభ*

Select Suryaa Now
*కొండకేగిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి* - *గోవింద నామస్మరణతో మారుమోగిన భీమ్‌గల్ పురవీధులు* - *భక్తజన సందోహం మధ్య వైభవంగా ఉత్సవ విగ్రహాల ఊరేగింపు* - *వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. బోనాలు, మంగళహారతులతో ఆధ్యాత్మిక శోభ*
సూర్య,భీమ్‌గల్ : జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీమన్నింబాచల క్షేత్రంలో కార్తీక మాస బ్రహ్మోత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భీమ్‌గల్ పట్టణంలో అత్యంత ప్రాచీనమైన గ్రామాలయంలో ఏడాది పొడవునా పూజలందుకున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పూజల అనంతరం కొండపైకి తీసుకెళ్లారు.బ్రహ్మోత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని గ్రామాలయంలో అర్చకులు స్వామివారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా పూలతో అలంకరించిన పల్లకిలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి ఊరేగింపుగా కొండకు బయలుదేరారు. బోయలు పల్లకిని మోస్తుండగా మేళతాళాలు, భక్తి కీర్తనలు, మంగళహారతులు ఊరేగింపునకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. మహిళలు సువాసినులుగా నెత్తిన బోనాలు ధరించి భక్తిపారవశ్యంతో స్వామివారి పల్లకిని అనుసరించారు.
*గ్రామాలయం నుంచి నందిగల్లీ మీదుగా పురానిపేట్ వరకు* 
సాగిన ఈ ఆధ్యాత్మిక ఊరేగింపులో పట్టణ ప్రజలు, పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్గమధ్యంలో భక్తులు పల్లకిలో కొలువుదీరిన స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అడుగడుగునా భక్తుల నీరాజనాలు, గోవింద నామస్మరణతో భీమ్‌గల్
 పురవీధులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.సాయంత్రం ఉత్సవ విగ్రహాలు శ్రీమన్నింబాచల క్షేత్రానికి చేరుకోగా ఆలయ అర్చకులు నంబి పార్థసారథి కుటుంబ సభ్యులు సంప్రదాయ ఆగమ శాస్త్ర విధానాల ప్రకారం స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ కీర్తివర్ధనం ప్రమాణాన్ని అనుసరించి పూజలు జరిపి, శ్రీమన్నారాయణుని అర్చావతార వైభవాన్ని చాటిచెప్పే పాంచరాత్ర ఆగమ సంప్రదాయం ప్రకారం కార్తీక బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.
*భక్తులకు ఆధ్యాత్మిక ఆనందోత్సవం*
కార్తీక మాసం విష్ణుమూర్తి ఆరాధనకు అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో స్వామివారి దర్శనం, దీపారాధన, నామస్మరణ, పూజలు చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ప్రతి ఏడాది గ్రామాలయం నుంచి కొండపైకి ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లే ఈ సంప్రదాయం ప్రాంత ప్రజల ఐక్యతకు, తరతరాలుగా కొనసాగుతున్న భక్తి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది.స్వామివారి కొండకేగే కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొనడంతో శ్రీమన్నింబాచల క్షేత్ర పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి. కార్తీక బ్రహ్మోత్సవాల ప్రారంభంతో రానున్న రోజుల్లో స్వామివారి దర్శనానికి భక్తుల తాకిడి మరింత పెరగనుంది.