వాసవి క్లబ్ రీజియన్ సెక్రటరీగా నూలి శ్రీనివాస్
నిడదవోలు,నరసాపురం, మేజర్ న్యూస్ :వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ 2027 సంవత్సరానికి సంబంధించి రీజియన్ ఛైర్మెన్ గా బదరి, సెక్రటరీ గా నూలి శ్రీనివాస్ ను నియమించారు. వీరి పరిధి లో 20 క్లబ్ లకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తూ క్లబ్ ల ద్వారా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఆదివారం నిడదవోలు లో జరిగిన కార్యక్రమంలో వీరిని నియమించి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సంవత్సరానికి బెస్ట్ జోన్ చైర్మెన్ గా నులిశ్రీనివాస్, బెస్ట్ డీపీవో గా బదరీ ని ఎంపిక చేసి వారికి అవార్డులు ప్రదానం చేశారు, ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.