BREAKING
చైనా గుప్పిట్లోనూ వీడని ఖనిజాల పట్టు గాండ్లపెంట ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా దూర్జటి శ్రీవల్లి ఈ నెల 16న కలెక్టరేట్ లో బాలల ప్రజావాణి ట్రంప్ జ్యుడిషియల్ నియామకాలకు రిపబ్లికన్ల షాక్ శౌర్య క్రియేషన్స్ పై సరికొత్త సినిమాలతో డైరెక్టర్, హీరో బోదాసు నరసింహం 12 గంటల పాటు అలుపెరుగని పరుగు.. ఆరోగ్యమే అసలైన సంపద! - 96, 72 కిలోమీటర్లు పరుగెత్తిన డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, జగిత్యాల రజినేష్ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ అన్ని రంగాల్లో ముందుండాలి -- యువకులకు వాలీబాల్ నెట్ కోసం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జోర్డాన్ చర్చిపై ఉగ్రదాడి కేసులో సంచలన తీర్పు..ముగ్గురు దోషులకు ఉరిశిక్ష విధించిన కోర్టు వైసీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి తలారి రంగయ్య పిలుపు రాష్ట్రస్థాయి హాకీ టోర్నీలో నిజామాబాద్ జట్టు విజయం వాసవి క్లబ్ రీజియన్ సెక్రటరీగా నూలి శ్రీనివాస్ దుర్కి గిరిజన గురుకులంలో ఘనంగా భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు. తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 గుడిసె రహిత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం - పట్టణ సర్పంచ్ రేఖ సుదర్శన్ భారత్-ఇటలీ మధ్య శాస్త్రీయ పరిశోధకుల సహకారానికి ప్రత్యేక నిధి ఏర్పాటు

విశ్వశాంతి పాఠశాలలో బాలల దినోత్సవం

Select Suryaa Now
విశ్వశాంతి పాఠశాలలో బాలల దినోత్సవం

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన భట్టిప్రోలు లోని విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రాంగణములో  దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని 'బాలల దినోత్సవ వేడుకలు' అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ఎంఈఓ దేవరాజు  విచ్చేసి, నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థులు చిన్నప్పటి నుండే క్రమశిక్షణతో పాటు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని సూచించారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలలో కూడా రాణించాలని ఆకాంక్షించారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు:
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, దేశభక్తి గీతాలు, నాటికలు మరియు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాఠశాల ఆవరణ అంతా విద్యార్థుల కేరింతలతో పండుగ వాతావరణాన్ని తలపించింది. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎంపీ.వెంకటరావు , ప్రిన్సిపాల్ యన్. వెంకటప్పయ్య, ప్రధానోపాధ్యాయులు ఫణిపార్ధసారధి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.