BREAKING
చైనా గుప్పిట్లోనూ వీడని ఖనిజాల పట్టు గాండ్లపెంట ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా దూర్జటి శ్రీవల్లి ఈ నెల 16న కలెక్టరేట్ లో బాలల ప్రజావాణి ట్రంప్ జ్యుడిషియల్ నియామకాలకు రిపబ్లికన్ల షాక్ శౌర్య క్రియేషన్స్ పై సరికొత్త సినిమాలతో డైరెక్టర్, హీరో బోదాసు నరసింహం 12 గంటల పాటు అలుపెరుగని పరుగు.. ఆరోగ్యమే అసలైన సంపద! - 96, 72 కిలోమీటర్లు పరుగెత్తిన డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, జగిత్యాల రజినేష్ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ అన్ని రంగాల్లో ముందుండాలి -- యువకులకు వాలీబాల్ నెట్ కోసం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జోర్డాన్ చర్చిపై ఉగ్రదాడి కేసులో సంచలన తీర్పు..ముగ్గురు దోషులకు ఉరిశిక్ష విధించిన కోర్టు వైసీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి తలారి రంగయ్య పిలుపు రాష్ట్రస్థాయి హాకీ టోర్నీలో నిజామాబాద్ జట్టు విజయం వాసవి క్లబ్ రీజియన్ సెక్రటరీగా నూలి శ్రీనివాస్ దుర్కి గిరిజన గురుకులంలో ఘనంగా భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు. తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 గుడిసె రహిత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం - పట్టణ సర్పంచ్ రేఖ సుదర్శన్ భారత్-ఇటలీ మధ్య శాస్త్రీయ పరిశోధకుల సహకారానికి ప్రత్యేక నిధి ఏర్పాటు

ఉపగ్రహ సాంకేతికతపై మిట్స్ విద్యార్థుల పారిశ్రామిక పర్యటన : బెంగళూరులోని ఇస్రో యు.ఆర్.ఎస్.సి సెంటర్ విజిట్

Select Suryaa Now
ఉపగ్రహ సాంకేతికతపై మిట్స్ విద్యార్థుల పారిశ్రామిక పర్యటన : బెంగళూరులోని ఇస్రో యు.ఆర్.ఎస్.సి సెంటర్ విజిట్

కురబలకోట,మేజర్ న్యూస్ : మదనపల్లి సమీపంలో గల (మదనపల్లె ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సైబర్ సెక్యూరిటీ) విభాగానికి చెందిన విద్యార్థులు పారిశ్రామిక పర్యటనలో భాగంగా ఆదివారం బెంగళూరులోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన యు.ఆర్.రావు శాటిలైట్ సెంటర్ (యు.ఆర్.ఎస్.సి)ను సందర్శించినట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు.ఇందులో భాగంగా యు.ఆర్.రావు శాటిలైట్ సెంటర్‌కు చెందిన సీనియర్ శాస్త్రవేత్త బి.శంకర్ మదస్వి విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఆయన ఉపగ్రహాల రూపకల్పన,అభివృద్ధి,తయారీ,అనుసంధానం,పరీక్షా విధానాల గురించి వివరించడంతోపాటు సమాచార ప్రసారం,నావిగేషన్,భూ పరిశీలన,శాస్త్రీయ పరిశోధనల్లో ఉపగ్రహాల ప్రాధాన్యతను తెలియజేశారు.అంతేకాకుండా ఉపగ్రహాల్లో ఉపయోగించే ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్,కమ్యూనికేషన్ వ్యవస్థలు, డేటా నిర్వహణలో కంప్యూటర్ సైన్స్ పాత్రను వివరించారు.ఉపగ్రహ సమాచార ప్రసార వ్యవస్థలు,గ్రౌండ్ స్టేషన్లు,మిషన్ డేటాను సైబర్ ముప్పుల నుంచి రక్షించడంలో సైబర్ సెక్యూరిటీ ఎంతో కీలకమని తెలిపారు.విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పరిశోధనా దృక్పథం,సమస్యలను పరిష్కరించే నైపుణ్యం,బృంద సమన్వయం,నూతన ఆవిష్కరణలపై ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు.అంతరిక్ష పరిశోధన,ఉపగ్రహ సాంకేతికత,సైబర్ భద్రత రంగాల్లో అర్హత కలిగిన నిపుణులకు భవిష్యత్తులో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్,సెక్యూరిటీ ఇంజినీర్,ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్,కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇంజినీర్,డేటా అనలిస్ట్,శాటిలైట్ సిస్టమ్స్ ఇంజినీర్ వంటి ఉద్యోగ రంగాల్లో విద్యార్థులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని వివరించారు.అలాగే ఇస్రో,అంతరిక్ష పరిశోధనా సంస్థలు,ప్రభుత్వ,ప్రైవేటు అంతరిక్ష సాంకేతిక సంస్థలు,రక్షణ రంగం,ఐటీ,సైబర్ సెక్యూరిటీ సంస్థల్లో ఉద్యోగ,పరిశోధనా అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఈ పారిశ్రామిక పర్యటన ద్వారా విద్యార్థులు తరగతి గదుల్లో నేర్చుకున్న సైద్ధాంతిక పరిజ్ఞానాన్ని ప్రత్యక్ష సాంకేతిక అనుభవంతో అనుసంధానం చేసుకునే అవకాశం లభించిందని,భవిష్యత్తులో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ పర్యటన ఎంతగానో దోహదపడిందని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు.ఈ పర్యటనలో 48 మంది విద్యార్థులతోపాటు అధ్యాపకులు డాక్టర్ ఆర్.సందీప్ కుమార్,సి.అపర్ణ పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి