ఆర్.నడింపల్లి పంచాయతీ సర్పంచ్ బరిలో సిహెచ్ సరసమ్మ : వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ : గ్రామ అభివృద్ధి,ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయమని వెల్లడి
రామసముద్రం,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా,మదనపల్లి నియోజకవర్గం,రామసముద్రం మండలంలోని ఆర్.నడింపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల బడిలో సర్పంచ్ అభ్యర్థిగా సిహెచ్ సరసమ్మ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) బలపరిచిన అభ్యర్థిగా ఆమె పోటీకి సిద్ధమయ్యారు.గ్రామ ప్రజల ఆదరాభిమానాలతో సర్పంచ్‌గా విజయం సాధించి,గ్రామ అభివృద్ధికి కృషిచేయాలనే లక్ష్యంతో ఆమె ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు.గతంలో పంచాయతీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా కుటుంబం ద్వారానే జరిగాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.సరసమ్మ బావ సిహెచ్ రామచంద్రా రెడ్డి సర్పంచిగా,రెండుసార్లు జడ్పిటిసిగా పనిచేయడం విశేషం.తమ పంచాయతీలో జనరల్ మహిళ రావడంతో మరోసారి వారి కుటుంబంలోని సర్పంచ్ అభ్యర్థిగా ఉండాలని అందరూ ఏకిభవించడంతో ఆమెను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రకటించారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్