BREAKING
భారత్-ఇటలీ మధ్య శాస్త్రీయ పరిశోధకుల సహకారానికి ప్రత్యేక నిధి ఏర్పాటు ఛత్ మహాపర్వ్ సంధ్యా అర్ఘ్యం వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు పురపాలక ఎన్నికలకు నేటి వరకు 69 నామినేషన్లు వచ్చాయి మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు పట్టా భూములపై పెత్తనం.. ప్రశ్నిస్తే దౌర్జన్యమా?అర్ధరాత్రి వేళ కంచె తొలగించి ఆక్రమణకు యత్నం!ప్రాణభయంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా ఫిర్యాదు స్వీకరించలేదని బాధితుల ఆరోపణజిల్లా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వేడుకోలు బిఆర్ఎస్ పార్టీలో నూతన ఉత్సవం - భారీగా పార్టీలో చేరుతున్న నాయకులు - సుడిగాలి పర్యటనలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే విశ్వశాంతి పాఠశాలలో బాలల దినోత్సవం ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఆర్.నడింపల్లి పంచాయతీ సర్పంచ్ బరిలో సిహెచ్ సరసమ్మ : వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ : గ్రామ అభివృద్ధి,ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయమని వెల్లడి *కొండకేగిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి* - *గోవింద నామస్మరణతో మారుమోగిన భీమ్‌గల్ పురవీధులు* - *భక్తజన సందోహం మధ్య వైభవంగా ఉత్సవ విగ్రహాల ఊరేగింపు* - *వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. బోనాలు, మంగళహారతులతో ఆధ్యాత్మిక శోభ* బెంగళూరు వేదికగా కామన్వెల్త్ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు స్వర్ణోత్సవాల సంబరాల్లో ఐఏఎఫ్ 3 బేస్ రిపేర్ డిపాట్ ఉపగ్రహ సాంకేతికతపై మిట్స్ విద్యార్థుల పారిశ్రామిక పర్యటన : బెంగళూరులోని ఇస్రో యు.ఆర్.ఎస్.సి సెంటర్ విజిట్ రాష్ట్రస్థాయి పోటీలకు టీ ఎం రావ్ హెచ్ ఎస్ విద్యార్థులు దేశంలో పేదరిక నిర్మూలన, నక్సలిజం అణచివేతే ప్రభుత్వ ప్రధాన విజయాలన్న ప్రధాని మోదీ సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి భక్తుల విరాళాలు

కార్మిక సమస్యల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యం తగదు - సీఐటీయూ నేత అల్లి రాజేందర్

Select Suryaa Now
కార్మిక సమస్యల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యం తగదు - సీఐటీయూ నేత అల్లి రాజేందర్
సూర్య, మందమర్రి : సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి సరికాదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఉప ప్రధాన కార్యదర్శి అల్లి రాజేందర్ విమర్శించారు. ఆదివారం పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యంతో పాటు గుర్తింపు సంఘాలుగా కొనసాగుతున్న సంఘాలు కూడా బాధ్యతగా వ్యవహరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు సకాలంలో అందించాల్సిన పనిముట్లు, చలికాలంలో ఇవ్వాల్సిన గరం కోట్లు ఇప్పటికీ పంపిణీ చేయకపోవడం, యాక్టింగ్ ప్యానెల్ జాబితాలను గనుల వద్ద ప్రదర్శించకపోవడం యాజమాన్య నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కార్మికుల వేతనాల నుంచి రికవరీ చేసిన సీఎంపీఎఫ్ సొమ్ము వారి ఖాతాల్లో జమైందో లేదో స్పష్టత లేకపోవడంపై బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ఫిల్టర్ బెడ్ల వద్ద రాత్రి వేళల్లో భద్రతా సిబ్బందిని నియమించాలని, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని గతంలోనే యాజమాన్యానికి వినతిపత్రం సమర్పించినా పట్టించుకోలేదన్నారు. ఫలితంగా గత నెల రోజుల్లో రెండుసార్లు దొంగతనాలు జరిగాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా స్పందించి ఫిల్టర్ బెడ్ల చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడలు నిర్మించడంతో పాటు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, పూర్తిస్థాయిలో సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. సింగరేణి వ్యాప్తంగా సెక్యూరిటీ, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో ఏర్పడిన ఖాళీలను జనరల్ అసిస్టెంట్లతో తాత్కాలికంగా భర్తీ చేస్తూ కాలయాపన చేయకుండా పూర్తిస్థాయి నియామకాలు చేపట్టాలని కోరారు. లేబర్ కమిషనర్ నిర్వహించిన గుర్తింపు సంఘాల ఎన్నికల రెండేళ్ల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో యాజమాన్యం అన్ని యూనియన్లను సమానంగా గుర్తించి వ్యవహరించాలని సూచించారు. కొంతమంది నాయకులను జనరల్ షిఫ్టుల్లో వారి విధులకు సంబంధం లేని ఇతర పనుల్లో కొనసాగించడం వల్ల సాధారణ కార్మికులపై పని భారం పడుతోందన్నారు. ఈ పరిస్థితులతో కార్మికులు విధులు సక్రమంగా నిర్వహించలేక డ్యూటీలకు గైర్హాజరవుతున్నారని తెలిపారు. యాజమాన్యం ఇప్పటికైనా కార్మికుల సమస్యలపై దృష్టి సారించి తక్షణ చర్యలు చేపట్టాలని అల్లి రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడల ప్రవీణ్, భద్రి ఆదర్శ్, భేతి భరత్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.