రాష్ట్రస్థాయి పోటీలకు టీ ఎం రావ్ హెచ్ ఎస్ విద్యార్థులు
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: రాష్ట్రస్థాయి పోటీలకు తమ పాఠశాల విద్యార్థులు ఇరువురు ఎంపికైనట్లు స్థానిక తమన్న మల్లికార్జున రావు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే కోటేశ్వరమ్మ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 13 న వినుకొండలోని లయోలా హైస్కూల్లో జరిగిన ఉమ్మడి గుంటూరు జిల్లా కోకో సెలక్షన్స్ లో అండర్ 14 విభాగంలో పాఠశాల విద్యార్థి కే నాగసాయి సెలెక్ట్ అయ్యాడన్నారు. అలాగే చుండూరు లో ఈరోజు జరిగిన అండర్ 17 విభాగంలో సాఫ్ట్ బాల్ సెలక్షన్స్ లో సిహెచ్ లక్ష్మీ కౌశిక్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో స్టేట్ కు సెలక్ట్ అవడం జరిగిందని హెచ్ఎం తెలిపారు. కరెస్పాండెంట్ పి మల్లికార్జున రావు, సిహెచ్ శ్రీనివాస్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. నాగసాయి అమలాపురంలో జరిగే కోకో స్టేట్ మీట్లో, లక్ష్మీ కౌశిక్ పులివెందులలో జరిగే స్టేట్ మీట్ లో సాఫ్ట్ బాల్ పులివెందులలో ఆడతాడని తెలియజేశారు.