క్రమశిక్షణ,ఆత్మస్థైర్యానికి మార్షల్ ఆర్ట్స్ దోహదం : మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు స్పష్టం : లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సెమినార్‌కు ముఖ్యఅతిథిగా హాజరు
మదనపల్లె,మేజర్ న్యూస్ : పట్టణంలోని సంగం ఫంక్షన్ హాల్ సమీపంలో నిర్వహిస్తున్న లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో ఆదివారం ఏర్పాటు చేసిన సెమినార్‌కు మదనపల్లి మున్సిపల్ చైర్మన్,రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.అకాడమీ కోచ్ మురళి ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొని మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఆత్మవిశ్వాసం,క్రమశిక్షణ,ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు.మార్షల్ ఆర్ట్స్ అద్భుతమైన కళ అని,ఉజ్వల భవిష్యత్తు కోసం మంచి విద్య,ఆత్మ రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ ప్రతి విద్యార్థికి అవసరమని ఆయన సూచించారు.విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ అందిస్తున్న కోచ్ మురళిని ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు మురళి మాట్లాడుతూ ఏ రంగంలోనైనా పట్టుదలతో ముందుకు సాగితే విజయం సాధించవచ్చునన్నారు.ఇందుకు శ్రీరామ్ చినబాబు నిదర్శనమని,రాజకీయాల్లో ఎన్నో ఒడిదొడుకులను ధైర్యంగా ఎదుర్కొని నేడు మదనపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం అధిరోహించారని కొనియాడారు.మా ఆహ్వానం మేరకు సెమినార్‌కు హాజరైన శ్రీరామ్ చినబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి