BREAKING
గీతాంజలి లో ఘనంగా స్వయం పాలన, బాలల దినోత్సవ వేడుకలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న విజేత ఉపాధ్యాయులు ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి-టీ ఆర్ ఎస్ అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్ బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక నవంబర్ 26న మున్సిపల్ ఎన్నికలు.. 87 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు 188 వార్డులకు 443 పోలింగ్ స్టేషన్లు.. భద్రతపై ప్రత్యేక దృష్టి ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు జగద్గురువుల దర్శనానికి సర్వం సిద్ధం - ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు మదర్ తెరిసా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి బిజెపి ఆర్టిఐ జిల్లా కన్వీనర్ గా శ్రవణ్ కుమార్ నియామకం చీరాల వైసీపీకి షాక్.. టీడీపీలోకి యూత్ లీడర్ పేర్లి నాని నవంబర్ 18న దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర 11వ సభ... ప్రజల ఆరోగ్యంతో అధికారుల చెలగాటం! పట్టణంలో ఎక్కడ చూసినా అనధికారిక అల్పాహార కేంద్రాలే... నాణ్యత లేని ఆహార పదార్థాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు! నిబంధనలు గాలికి.. అధికారుల పర్యవేక్షణ కరువు.. పట్టించుకునే నాథుడే లేడా? ఘనంగా బాలల దినోత్సవం ఐక్యతే బలం.. సేవే లక్ష్యం కావాలి - నిరుపేదలకు అండగా నిలవాలి - రాజకీయ రంగంలోనూ రాణించాలి – నలమాస్ కాంతయ్య

ఘనంగా గురుశ్రేష్ఠ అవార్డుల ప్రధాన కార్యక్రమం

Select Suryaa Now
ఘనంగా గురుశ్రేష్ఠ అవార్డుల ప్రధాన కార్యక్రమం
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి. : నిర్మల్ పట్టణంలో ట్రస్మా (తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం) నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో ఆర్. కె. ఫంక్షన్ హల్ లో నిర్వహించిన గురుశ్రేష్ఠ అవార్డుల ప్రధాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్మల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రీమతి అప్పాల కావ్య , మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి  ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి మరువలేనిదని పేర్కొన్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమన్నారు.విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి గురుశ్రేష్ఠ అవార్డులతో సత్కరించడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎస్పీ రాజు, కత్తి నరేందర్, మాజీ కౌన్సిలర్ తోట నర్సయ్య, ట్రస్మా జిల్లా ప్రతినిధులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యారంగ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.