telangana
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న విజేత ఉపాధ్యాయులు
సూర్య ఖానాపూర్ : ఖానాపూర్ లోని విజేత పాఠశాల కు చెందిన నలుగురు ఉపాధ్యాయులు గురు శ్రేష్ఠ అవార్డును అందుకున్నారు. నిర్మల్ పట్టణం లోని ఆర్కే ఫంక్షన్ హాల్ లో జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జిల్లా స్తాయి గురు శ్రేష్ఠ అవార్డు కార్యక్రమంలోఆదిలాబాద్ ఎంపీ గెడం నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చేతుల మీదుగా విజేత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు సుస్మిత , రమ, శైలజ, మమతలు అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఉపాద్యయులు మాట్లాడుతూ పాఠశాలలో తమ వంతుగా విధులను నిర్వర్తించినందుకు కాను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు పాఠశాల యాజమాన్యానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు, జిల్లా, మండల ట్రస్మ మా నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఇందులో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పల గణేష్ కావ్య, ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షులు శేఖర్ రావు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పడాల ప్రభాకర్, ఖానాపూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మదిరె శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు మనోహర స్వామి , రాష్ట్ర ,జిల్లా, మండల ట్రస్మ నాయకులు తదితరులు పాల్గొన్నారు.