BREAKING
గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు ప్రోత్సహించడం అభినందనీయం. సార్సాలలో విఓ భవనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్సీ. పల్లెలకు పాకిన గంజాయి మత్తు!? ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నేటి బాలలే రేపటి దేశానికి మార్గదర్శకులు సర్పంచ్ పోలు సంపత్ చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై సమీక్షా సమావేశం తాగునీటి సరఫరా నివారణకు వెంటనే ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి 5 లక్షల రూపాయల విలువైన ఎల్ఓసి లను అందించిన ఎమ్మెల్యే గీతాంజలి లో ఘనంగా స్వయం పాలన, బాలల దినోత్సవ వేడుకలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న విజేత ఉపాధ్యాయులు ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి-టీ ఆర్ ఎస్ అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్ బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక నవంబర్ 26న మున్సిపల్ ఎన్నికలు.. 87 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు 188 వార్డులకు 443 పోలింగ్ స్టేషన్లు.. భద్రతపై ప్రత్యేక దృష్టి ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు జగద్గురువుల దర్శనానికి సర్వం సిద్ధం - ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు

జగద్గురువుల దర్శనానికి సర్వం సిద్ధం - ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు

Select Suryaa Now
జగద్గురువుల దర్శనానికి సర్వం సిద్ధం - ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు
సూర్య,కాగజ్‌నగర్:  కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు మైదానంలో ఈ నెల 16వ తేదీ సోమవారం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ నరేంద్రాచార్య స్వామివారి దర్శన కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో సభా ప్రాంగణం, మండపం, దర్శన ఏర్పాట్లను సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు కాగజ్‌నగర్ డీఎస్పీ వహిదుద్దీన్‌తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సద్గురువుల దర్శనం, ఆశీస్సులు పొందేందుకు సిర్పూర్ నియోజకవర్గంతో పాటు ఆసిఫాబాద్ జిల్లా, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. జగద్గురువుల అమృత వాక్కులు వినడంతో పాటు వారి దివ్య ఆశీస్సులు పొందేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ కుమారస్వామి, టౌన్ ఎస్ఐ వెంకన్న గౌడ్, పీఠ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.