చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై సమీక్షా సమావేశం
…. సమన్వయంతో పనిచేసి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని శ్రేణులకు పిలుపు…..
చీపురుపల్లి, నవంబర్14 మేజర్ న్యూస్: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో చీపురుపల్లి మేజర్ పంచాయతీ ఎన్నికల వ్యూహాలపై , చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట రావు తన కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రౌతు కాము నాయుడు, జెడ్పీటీసీ వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, టౌన్ అధ్యక్షులు గవిడి నాగరాజు, దన్నాన రామచంద్రుడు,, ఇజ్జురోతు రాంబాబు, ముళ్ళు రమణ, రౌతు నారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు మాట్లాడుతూ చీపురుపల్లి మేజర్ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి రౌతు కాము నాయుడు విజయానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. వార్డుల వారీగా ఎన్నికల ప్రచార సరళి, ఓటర్ల మద్దతు, క్షేత్రస్థాయి పరిస్థితులపై నాయకులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందేలా సమన్వయంతో పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా