కడవెరుగు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
చేర్యాల …చేర్యాల: కడవెరుగు గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శనివారం గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి రమేష్ గుప్తా ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి హాజరై కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. వడ్లు తుర్పాన పట్టే యంత్రాలు అందుబాటులో లేవని ,అవి పని చేయడం లేదని రైతులు కోరగా ,మార్కెట్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి అధికారులతో మాట్లాడి త్వరలో కొత్తవి రెండు తుర్పాన పట్టే మిషిన్లను గ్రామానికి ఇవ్వాలని తెలియజేసారు ,ఇందుకు గ్రామం లోని రైతులు కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మెరుగు కృష్ణ, పీఏసీఎస్ డైరెక్టర్,లు ఉపసర్పంచ్ జంగా సురేందర్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.