BREAKING
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ప్రోత్సాహం పిల్లలకు భవిష్యత్తా? బాల్యమా? పదవులు ముగిసినా ప్రజాసేవలో కొనసాగాలి.. ఎమ్మెల్సీల సేవలు చిరస్మరణీయం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఐక్య పోరాటాల ద్వారానే హక్కుల సాధన కొత్వాల్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు సాయి కృష్ణ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కక్షలు వదిలేద్దాం.. గ్రామాల్లో శాంతిని కాపాడుకుందాం!.. వేమన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాంతి సందేశ కరపత్రాల ఆవిష్కరణ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌, కొల్లూరులో నిర్మాణ ప్రాజెక్టులతో పెరగుతున్న వాయు కాలుష్యం సింగీతంలో గ్రామంలో ఘనంగా బాలల గ్రామసభ ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలిసి సన్మానించిన రాప్తాడు జడ్పిటిసి జయలక్ష్మి! పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం:ఎంపీడీవో బాలాజీ సెయింట్ థెరిస్సా పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు రైతుల సమక్షంలోనే భూముల రీ సర్వే చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ నామినేషన్ కేంద్రాల్లో ఎస్పీ జగదీష్ అదహళ్లి తనిఖీలు సెయింట్ పాల్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

సెయింట్ పాల్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
సెయింట్ పాల్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

సదాశివపేట ;  సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామంలోని సెయింట్ పాల్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ రోజా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు విద్యార్థుల సందడి, ఉత్సాహంతో అట్టహాసంగా సాగాయి.ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల వేషధారణలతో అలరించడంతో పాటు ఆటపాటలు, ఆకట్టుకునే నృత్య ప్రదర్శనలతో అదరగొట్టారు. చిన్నారుల రంగురంగుల వేషధారణలు, చక్కటి నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమలోని ప్రతిభను ప్రదర్శించారు.ఈ సందర్భంగా కరస్పాండెంట్ రోజా మాట్లాడుతూ బాలలే భావి భారత పౌరులని, వారి ఆనందమే సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. వేడుకలు ఉల్లాసభరిత వాతావరణంలో ముగిశాయి.