సింగీతంలో గ్రామంలో ఘనంగా బాలల గ్రామసభ
రాయికోడ్, ; బాలల హక్కులు, వారి అభిప్రాయాలకు ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయికోడ్ మండల పరిధిలోని సింగీతం గ్రామంలో శుక్రవారం నాడు బాల గ్రామసభను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ శ్రావణి నిరంజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ శ్రావణి నిరంజన్ చిన్నారులతో మమేకమై వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. బాలల దినోత్సవం ప్రాముఖ్యతను తెలియజేస్తూ, పిల్లల ఆనందం, అభివృద్ధి, విద్యాభ్యాసం, వారి సమస్యల పరిష్కారానికి గ్రామస్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు. బాలల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నిర్వహించిన బాల గ్రామసభలో చిన్నారులు, గ్రామ ప్రజలు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.అనంతరం చిన్నారులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేసి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. పిల్లలతో కలిసి ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.
ఈ యొక్క కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెద్దగొల్ల మహేష్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మణాచారి, మాజీ ఎంపీటీసీ నిరంజన్, అంగన్‌వాడీ టీచర్లు సంగీత, శివలీల, వార్డు సభ్యులు ప్రశాంత్, మొగులయ్య, గ్రామ ప్రముఖులు, యువకులు నవీన్, రవీందర్, బాబు, అంజయ్య, నిరంజన్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.