సెయింట్ థెరిస్సా పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
సంగారెడ్డి ; సంగారెడ్డి లోని సెయింట్ థెరిస్సా పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు విద్యార్థులు, తల్లిదండ్రుల ఆనందోత్సాహాల మధ్య కనుల పండువగా సాగాయి.ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా ఆటపాటలు, నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రత్యేకంగా తల్లిదండ్రుల కోసం నిర్వహించిన ఆటపాటలు, వినోద కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.చదువుతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులలో సృజనాత్మకతను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు. బాలల దినోత్సవ వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో ముగిశాయి.