BREAKING
గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌ కళ్యాణదుర్గంలో వివేకానంద పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ సంబరాలు. 107 ఏళ్ల వయసులో కన్నుమూసిన యూసుఫ్.. సర్జఖాన్‌పేటలో విషాదం వరద ఆంజనేయ స్వామికి విశేషంగా పూజలు హొళగుంద, సూర్య ప్రతినిధి: కర్నూలు జిల్లా హొళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో కొలువైన వరద ఆంజనేయ స్వామికి శనివారం విశేషంగా పూజ నిర్వహించారు.ఆలయ అర్చకులు జేరుబండి నాగరాజు ఉదయాన్నే స్వామివారికి సుప్రభాత సేవ మహా మంగళహారతి పూజలను నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. వచ్చిన మోసపోయిన వారికి అండగా నిలుస్తాం : విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ నరసరావుపేటలో తొలిరోజు 55 నామినేషన్లు దాఖలు. కమిషనర్ బి. రమ్య కీర్తన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ప్రోత్సాహం పిల్లలకు భవిష్యత్తా? బాల్యమా? పదవులు ముగిసినా ప్రజాసేవలో కొనసాగాలి.. ఎమ్మెల్సీల సేవలు చిరస్మరణీయం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఐక్య పోరాటాల ద్వారానే హక్కుల సాధన కొత్వాల్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు సాయి కృష్ణ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కక్షలు వదిలేద్దాం.. గ్రామాల్లో శాంతిని కాపాడుకుందాం!.. వేమన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాంతి సందేశ కరపత్రాల ఆవిష్కరణ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌, కొల్లూరులో నిర్మాణ ప్రాజెక్టులతో పెరగుతున్న వాయు కాలుష్యం సింగీతంలో గ్రామంలో ఘనంగా బాలల గ్రామసభ

కక్షలు వదిలేద్దాం.. గ్రామాల్లో శాంతిని కాపాడుకుందాం!.. వేమన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాంతి సందేశ కరపత్రాల ఆవిష్కరణ

Select Suryaa Now
కక్షలు వదిలేద్దాం.. గ్రామాల్లో శాంతిని కాపాడుకుందాం!..  వేమన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాంతి సందేశ కరపత్రాల ఆవిష్కరణ

అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి :-పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎలాంటి కక్షలు, విభేదాలు లేకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని కోరుతూ వేమన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం అనంతపురంలో శాంతి సందేశ కరపత్రాలను ఆవిష్కరించారు. ఎన్నికలు కేవలం ఒక్కరోజు మాత్రమే జరిగినప్పటికీ, వాటి కారణంగా ఏర్పడే పగలు, ప్రతీకారాలు, వర్గ విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ఏర్పడే గొడవలు కుటుంబాల మధ్య సంబంధాలను దెబ్బతీయడమే కాకుండా గ్రామాల అభివృద్ధికి కూడా ఆటంకంగా మారుతాయని తెలిపారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని, గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. భావితరాలకు మంచి భవిష్యత్తును అందించాలంటే శాంతియుత జీవనమే మార్గమని సూచించారు. కార్యక్రమంలో వేమన ఫౌండేషన్ అధ్యక్షులు ఆచార్య కాడా రామకృష్ణారెడ్డి, కార్యదర్శి డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి, సభ్యులు రవీంద్రరాజు, మనోరంజన్ రెడ్డి, నాగశేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..