సాయి కృష్ణ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
సంగారెడ్డి ; పట్టణంలోని సాయి కృష్ణ హైస్కూల్లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ రామారావు, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు విద్యార్థుల ఉత్సాహం, ఆనందోత్సాహాల మధ్య వైభవంగా సాగాయి.ఈ సందర్భంగా విద్యార్థులకు బాలల దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు వివిధ ఆటపాటలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. చిన్నారుల సందడి, కేరింతలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.చదువుతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పాఠశాల నిర్వాహకులు తెలిపారు. వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి.