BREAKING
గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌ కళ్యాణదుర్గంలో వివేకానంద పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ సంబరాలు. 107 ఏళ్ల వయసులో కన్నుమూసిన యూసుఫ్.. సర్జఖాన్‌పేటలో విషాదం వరద ఆంజనేయ స్వామికి విశేషంగా పూజలు హొళగుంద, సూర్య ప్రతినిధి: కర్నూలు జిల్లా హొళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో కొలువైన వరద ఆంజనేయ స్వామికి శనివారం విశేషంగా పూజ నిర్వహించారు.ఆలయ అర్చకులు జేరుబండి నాగరాజు ఉదయాన్నే స్వామివారికి సుప్రభాత సేవ మహా మంగళహారతి పూజలను నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. వచ్చిన మోసపోయిన వారికి అండగా నిలుస్తాం : విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ నరసరావుపేటలో తొలిరోజు 55 నామినేషన్లు దాఖలు. కమిషనర్ బి. రమ్య కీర్తన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ప్రోత్సాహం పిల్లలకు భవిష్యత్తా? బాల్యమా? పదవులు ముగిసినా ప్రజాసేవలో కొనసాగాలి.. ఎమ్మెల్సీల సేవలు చిరస్మరణీయం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఐక్య పోరాటాల ద్వారానే హక్కుల సాధన కొత్వాల్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు సాయి కృష్ణ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కక్షలు వదిలేద్దాం.. గ్రామాల్లో శాంతిని కాపాడుకుందాం!.. వేమన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాంతి సందేశ కరపత్రాల ఆవిష్కరణ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌, కొల్లూరులో నిర్మాణ ప్రాజెక్టులతో పెరగుతున్న వాయు కాలుష్యం సింగీతంలో గ్రామంలో ఘనంగా బాలల గ్రామసభ

రైతుల సమక్షంలోనే భూముల రీ సర్వే చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్

Select Suryaa Now
రైతుల సమక్షంలోనే భూముల రీ సర్వే చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్

సూర్య వేములవాడ రూరల్ భూముల రీ సర్వే ప్రక్రియను రైతుల సమక్షంలోనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.వేములవాడ రూరల్ మండలం జయవరంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను శనివారం సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోవర్ యంత్రాలు, డిజిటల్ పరికరాల ద్వారా సర్వే చేస్తున్న తీరును పరిశీలించి సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జీపీఓలు, పంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ శాఖ అధికారులు రీ సర్వేపై గ్రామంలో రైతులకు ముందుగా సమాచారం అందించి అవగాహన కల్పించాలని సూచించారు. రైతులకు వారి భూముల వివరాలు తెలియజేసి సంతకాలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ, రెవెన్యూ, సర్వే శాఖ అధికారులు సమన్వయంతో సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కేఎస్ బీ కుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.