ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ప్రోత్సాహం
కొండాపూర్ ; మండల పరిధిలోని గొల్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. క్లబ్ ఆదర్శ పూర్వాధ్యక్షులు పర్యాద రామకృష్ణారెడ్డి దాతృత్వంతో జి. వేదశ్రీ, టి. శ్రీధర్, ఎం. సుమంత్‌లకు బహుమతులు అందించారు.ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు శంకరి విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల విద్యాభివృద్ధి, విద్యార్థుల ప్రోత్సాహమే లయన్స్ క్లబ్ ప్రధాన ఆశయమని, విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. దాత పర్యాద రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, పాఠశాల అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు.గ్రామ సర్పంచ్ గడీల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ విద్యార్థుల ప్రతిభను గుర్తించి నగదు ప్రోత్సాహకాలు అందించిన లయన్స్ క్లబ్‌కు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు వాటిలో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రియాంక నర్సింలు, వార్డు సభ్యులు ఎల్లయ్య, నవనీత, వీరారెడ్డి, రామాగౌడ్, దావీద్, జిల్లా చైర్మన్ రామప్ప, క్లబ్ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.