BREAKING
రైతు మహాసభలకు తరలిరావాలి అటవీ ఆధారిత జీవనోపాధితో గిరిజనులకు ఆర్థిక భరోసా వెలుగు సంస్థలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు : ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా : అపూర్వ స్వాగతం పలికిన సెక్రటరీ ఎం.ఉదయ్ మోహన్ రెడ్డి భారత్ సమ్మిట్ ను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం నవభారత్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.. గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌ కళ్యాణదుర్గంలో వివేకానంద పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ సంబరాలు. 107 ఏళ్ల వయసులో కన్నుమూసిన యూసుఫ్.. సర్జఖాన్‌పేటలో విషాదం వరద ఆంజనేయ స్వామికి విశేషంగా పూజలు హొళగుంద, సూర్య ప్రతినిధి: కర్నూలు జిల్లా హొళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో కొలువైన వరద ఆంజనేయ స్వామికి శనివారం విశేషంగా పూజ నిర్వహించారు.ఆలయ అర్చకులు జేరుబండి నాగరాజు ఉదయాన్నే స్వామివారికి సుప్రభాత సేవ మహా మంగళహారతి పూజలను నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. వచ్చిన మోసపోయిన వారికి అండగా నిలుస్తాం : విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ నరసరావుపేటలో తొలిరోజు 55 నామినేషన్లు దాఖలు. కమిషనర్ బి. రమ్య కీర్తన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ప్రోత్సాహం పిల్లలకు భవిష్యత్తా? బాల్యమా? పదవులు ముగిసినా ప్రజాసేవలో కొనసాగాలి.. ఎమ్మెల్సీల సేవలు చిరస్మరణీయం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఐక్య పోరాటాల ద్వారానే హక్కుల సాధన

నవభారత్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు..

Select Suryaa Now
నవభారత్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు..

అనంతపురం విద్య మేజర్ న్యూస్ :-భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని అనంతపురంలోని నవభారత్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.  పాఠశాల కరస్పాండెంట్ నిట్టూరు శశిభూషణ్ జ్యోతి ప్రజ్వలన చేసి, నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిట్టూరు కృష్ణవేణి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు పెద్దలను గౌరవించడం, తల్లిదండ్రులు, గురువులు చెప్పే మంచి మాటలను ఆచరించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు పుస్తక పఠనానికి సమయం కేటాయించాలని తెలిపారు. నవభారత్ పాఠశాలలో విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
అనంతరం విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాటలకు నృత్యాలు ప్రదర్శించడంతో పాటు పలు సందేశాత్మక నాటికలతో ఆకట్టుకున్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఆటల పోటీలు, భగవద్గీత శ్లోకాల పోటీలు, దస్తూరి పోటీలలో ప్రతిభ కనబరిచి మొదటి, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. చివరిగా నిట్టూరు అనిత వందన సమర్పణ చేయడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..