BREAKING
భారత్‌లో సైలెంట్‌ కిల్లర్‌గా మారుతున్న మధుమేహం - కరీంనగర్ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ మానవతా సంస్థ రెండు కుటుంబాలకు ఆర్థిక ఆసరా. కుంచెతో మెరిసిన చిన్నారులు - పారమిత వరల్డ్ స్కూల్  ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ అడ్వకేట్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి. సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆరా ఇగ్నైట్స్ ట్రస్ట్ అండ్. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు. 50 కిలోల బియ్యం అందజేత సాధన అద్వితీయమైన శక్తి ఈజిప్ట్‌లో గ్యాస్ ఇందన ప్రారంభించిన షెల్ రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో రంగారెడ్డి, మెదక్ జట్లు ఛాంపియన్లు వైభవంగా ఛత్ పూజ వేడుకలు.. ప్రకృతి ఆరాధనతో మార్మోగుతున్న నదీ తీరాలు ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించిన సుడా మాజీ చైర్మన్  తెలంగాణ హమాలీ మిల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కు సారంగపాణి 101 జంటలతో ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం యువతకు ఉద్యోగాల కల్పనలో ఏపీ దేశానికే ఆదర్శం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

రైతు మహాసభలకు తరలిరావాలి

Select Suryaa Now
రైతు మహాసభలకు తరలిరావాలి
సూర్య,కాగజ్‌నగర్: ఈ నెల 15న నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న 36వ అఖిల భారత జాతీయ రైతు మహాసభలను విజయవంతం చేయాలని, చలో నల్లగొండ కార్యక్రమానికి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని జిల్లా రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా కాగజ్‌నగర్ మండలం చింతగూడ గ్రామంలో మహాసభల ప్రచార పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. అనంతరం కాగజ్‌నగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ రైతాంగ సమస్యలు, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, రైతుల హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై మహాసభల్లో చర్చించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి రైతులు ఐక్యంగా తరలివచ్చి సభలను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం నాయకులు మాదారపు శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బొర్కుట్ రాజేందర్, ఎన్‌పీఆర్‌డీ నాయకులు రాజేష్, రైతులు మల్లేష్, శ్రీధర్, బొజ్జ రాజు, నర్సు, లచ్చయ్య, నరసయ్య, పరశురాములు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.